HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Leaders Wants To Join In Congress Congress Graph Increasing In Telangana

Telangana Congress : కాంగ్రెస్‌లోకి క్యూ క‌డుతున్న బీఆర్ఎస్ నేత‌లు.. తెలంగాణ‌లో మారుతున్న పాలిటిక్స్

రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాలు తారాస్థాయిలో కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో వారిలో ఓ వ‌ర్గం కాంగ్రెస్‌లోకి వ‌చ్చేలా పార్టీ అధిష్టానం పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

  • Author : News Desk Date : 10-06-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS leaders wants to join in congress congress graph increasing in Telangana
BRS leaders wants to join in congress congress graph increasing in Telangana

తెలంగాణ‌(Telangana)లో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్(Congress) ప‌ట్ల ఆద‌ర‌ణ రోజురోజుకు పెరుగుతోంది. క‌ర్ణాట‌క(Karnataka) ఎన్నిక‌ల త‌రువాత ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ వైపు ఇత‌ర పార్టీల నేత‌లు క్యూ క‌డుతున్నారు. బీఆర్ఎస్(BRS) బ‌హిష్కృత నేత‌లు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), జూప‌ల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao)లు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు బీజేపీ(BJP)లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, క‌ర్ణాట‌క ప‌లితాల త‌రువాత వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రికొద్ది రోజుల్లో భారీ బ‌హిరంగ స‌భ ద్వారా రాహుల్ లేదా ప్రియాంకా గాంధీ స‌మ‌క్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటార‌ని స‌మాచారం. వీరితో పాటు మ‌రికొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాలు తారాస్థాయిలో కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో వారిలో ఓ వ‌ర్గం కాంగ్రెస్‌లోకి వ‌చ్చేలా పార్టీ అధిష్టానం పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. శ‌నివారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్ నేత మ‌ల్లు ర‌వితో ఆయ‌న నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక విష‌యంపై వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. వీరి భేటీ అనంత‌రం కూచ‌కుళ్ల దామోద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

క్యాడర్ నన్ను కాంగ్రెస్‌లో చేరాల‌ని ప్రేజర్ చేస్తోంద‌ని అన్నారు. అయితే, నాగ‌ర్‌క‌ర్నూల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డితో మాట్లాడిన త‌రువాత నా నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నాకు బీఆర్ఎస్ అధిష్టానంతో వ‌చ్చిన ఇబ్బందేమీలేదు.. కానీ, లోకల్ ఇబ్బందులే నాకు ఎక్కువగా ఉన్నాయ‌ని చెప్పారు. నాగంతో మాట్లాడిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను అని దామోద‌ర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీల పరిస్థితి దారుణంగా ఉందని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు అధికారాలే లేవని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రాష్ట్రంలోని ప‌లువురు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

దామోద‌ర్ రెడ్డి లాంటి నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు ఉన్నార‌ని, వారంతా కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌వారితో చ‌ర్చించి స్థానిక నేత‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా స‌యోధ్య కుదిర్చే ప్ర‌క్రియ‌ను కాంగ్రెస్ అధిష్టానం మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్‌లోకి ఇత‌ర పార్టీల నేత‌లు క్యూ క‌డుతుండంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార బీఆర్ఎస్‌ పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

 

Also Read : Telangana Congress: బీఆర్ఎస్‌కు షాక్.. మల్లు రవితో దామోదర్ రెడ్డి భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Jupalli Krishna Rao
  • ponguleti
  • revanth reddy
  • telangana

Related News

Dk Shivakumar

Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్‌పీ) నాయకుడిగా ఎన్నికైన డీకే శివ‌కుమార్‌ను రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అధికారికంగా ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ఆహ్వానం అందినట్లు సమాచారం. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd