HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Complaint To Dgp On Illegal Cases Of Activists

BRS Party: కార్యకర్తల అక్రమ కేసుల పై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

  • Author : Balu J Date : 17-04-2024 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS Formation in Telangana
Brs Flag

BRS Party: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్నిప్రోత్సహిస్తోందని ఘాటుగా స్పందించింది. ‘‘ ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే సహించకలేకపోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ లు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారు. వారిని భయాంభ్రాంతులకు గురిచేస్తున్నారు. బైండవర్లు, కేసులు, ఫోన్లలో బెదిరింపులకు దిగుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా కేసులు పెడుతున్నారు. పోలీసు అధికారులు కూడా ప్రభుత్వానికి వంత పాడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై జులుం ప్రదర్శిస్తున్నారు’’ బీఆర్ఎస్ పార్టీ మండిపడింది.

‘‘ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. మా పార్టీకి చెందిన సల్వాజీ మాధవ రావు అనే ఉద్యమకారుడు కరీంనగర్ జిల్లా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మీద వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడని సొగాలి తిరుపతి అనే రౌడీ షీటర్ ద్వారా హత్యా యత్నం చేయించాడు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. పైగా అతని పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్నిమానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసుల తీరుపై యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సరే పోలీసులు ప్రజాస్వామ్యాన్ని, బావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే విధంగా పనిచేయాలి. కానీ కొంతమంది పోలీసులు మాత్రం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకు మడుగులు ఒత్తుతూ వారి మెప్పు కోసం పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు, బెదిరింపులు, అరెస్ట్ లంటూ భయాబ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు జీ హుజూర్ అంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులే ఈ విధంగా ప్రవర్తించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా గత పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు ప్రయత్నించలే. పోలీసులను ఉపయోగించుకొని ప్రశ్నించే వారిపై దాడి చేసే ప్రయత్నం చేయలే. ప్రశ్నించే వారికి, ప్రతిపక్షాలకు పూర్తి స్వేఛ్చనిచ్చాం. రాజకీయ ప్రతీకార దాడులు, విమర్శలు చేస్తే తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయలే. ముఖ్యంగా పోలీసులకు పూరి స్వేచ్చనిచ్చి లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాం. పోలీసుల ద్వారా ప్రతిపక్షాలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ కారణంగా గత పదేళ్లలో ప్రతిపక్షాల పై తప్పుడు కేసులు, దాడుల సంఘటనలే లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారిలో వచ్చిన నాలుగు నెలల్లోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, కేసులు, హత్యాప్రయత్నాలంటూ రోజుకు వార్తలు చూడాల్సి వస్తోంది. దురదృష్టమేమిటంటే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు వంత పాడుతూ వారికి తొత్తులుగా వ్యహరించటం దురదృష్టకరం’’ అని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • dgp
  • social media
  • TCongress

Related News

Mallareddy says goodbye to BRS

Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలి సమాధానాలు, విలక్షణమైన ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. త్వరలోనే బిఆర్ఎస్ (BRS) పార్టీని వీడనున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని వారాలుగా ఆయన పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో జరుగుతు

  • Election Commission deals a blow to Kavitha's party; 'Telangana Rakshana Sena' name must be changed.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • High drama at Telangana Bhavan; former minister Harish Rao taken into police custody.

    Harish Rao: తెలంగాణభవన్‌ వద్ద హైడ్రామా.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి హరీష్‌ రావు

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd