Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో యాత్రకు విరామం..!!
- By hashtagu Published Date - 10:24 AM, Fri - 4 November 22

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ ఈ పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో యాత్ర నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. అయితే ఇవాళ జోడోయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి శనివారం మెదక్ జిల్లా నుంచి పాదయాత్ర పున;ప్రారంభం అవుతుందని భారత్ జోడో అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొంది. 5, 6 తేదీల్లో తెలంగాణలో పూర్తి చేసుకుని 7వ తారీఖు మహారాష్ట్రలో ప్రవేశించనుంది. ఈ యాత్ర తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంటరీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.
#BharatJodoYatra will take a day's break on 4th Nov
We begin afresh from Medak, Telangana on 5th Nov.
Keep following all the updates. 🇮🇳 pic.twitter.com/cXV5DvTsYH
— Bharat Jodo Nyay Yatra (@bharatjodo) November 3, 2022
తెలంగాణ జిల్లాల్లో ప్రజలందర్నీ కలుస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ. పలువురు ప్రముఖులతోపాటు మేధావులు, వివిధ సంఘా నాయకులు రాహుల్ గాంధీని కలుస్తున్నారు. ఈ యాత్రను సమన్వయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.