HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Bjp Tops Google Ads Spend In 2023 Guess Who Is 2nd

Google Ads -2023 : గూగుల్ యాడ్స్ వ్యయంలో నంబర్ 1 బీజేపీ.. నంబర్ 2 ఏదో తెలుసా ?

Google Ads -2023 : గూగుల్ యాడ్స్‌‌ను ఎక్కువగా రన్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఏవి ?

  • By Pasha Published Date - 01:37 PM, Wed - 17 January 24
  • daily-hunt
Google Ads 2023
Google Ads 2023

Google Ads -2023 : గూగుల్ యాడ్స్‌‌ను ఎక్కువగా రన్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఏవి ? అనగానే చటుక్కున మనం బీజేపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీయే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. సంక్షేమ పథకాలపై ప్రజలను ఆకర్షించడానికి , అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ భారీగా గూగుల్ యాడ్స్‌ను రన్ చేసింది. గూగుల్ యాడ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా న్యూస్ వెబ్‌సైట్లతో పాటు యూట్యూబ్ ఛానళ్లలో యాడ్స్‌ను రన్ చేస్తుంటారు. 2023  సంవత్సరంలో గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచారంపై బీజేపీ ఎంత ఖర్చు చేసిందో తెలుసా ? రూ.19 కోట్లు. ఈ ఖర్చు విషయంలో బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీయే ఉందని అనుకుంటున్నారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. గూగుల్ యాడ్స్ ఖర్చులో బీజేపీ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ రూ. 12.1 కోట్లు ఖర్చు చేసింది. గూగుల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ సెంటర్ ఈవివరాలను(Google Ads -2023) వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రూ.11.9 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 16.5 లక్షలు,  కర్ణాటకలో రూ.270,000, తమిళనాడులో రూ.160,000,  మహారాష్ట్రలో రూ.92,000 ఖర్చు చేసింది. గత సంవత్సరం నవంబర్ 24 నుంచి నవంబర్ 28 వరకు మూడు బీఆర్ఎస్ యాడ్స్ ఒక్కొక్కటి 10 మిలియన్ సార్లు వచ్చాయి. ఇంత భారీగా ఖర్చు చేసినప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. దీన్నిబట్టి బీఆర్ఎస్‌పై ప్రజా వ్యతిరేకత ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది కాంగ్రెస్ పార్టీ గూగుల్ యాడ్స్‌పై కేవలం రూ.4.59 కోట్లే ఖర్చు చేసింది. తెలంగాణలో గూగుల్ యాడ్స్‌పై కాంగ్రెస్ పార్టీ రూ. 3,250 ఖర్చు చేయగా, బీఆర్‌ఎస్ పార్టీ భారీగా రూ. 11.9 కోట్లు ఖర్చు చేసి ఓడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రూ.1.92 కోట్లు ఖర్చు చేసి ఓడిపోయింది.

Also Read: 50 Years – Single Charge : ఫోన్లలో న్యూక్లియర్ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 50 ఏళ్లు లైఫ్

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ గూగుల్ యాడ్స్‌పై డబ్బు ఖర్చు చేయలేదు. బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలలో రూ. 43,250 గూగుల్ యాడ్స్‌పై ఖర్చు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలో గూగుల్ యాడ్స్‌పై రూ. 7.2 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ఓడిపోయింది. రాజస్థాన్‌లో గూగుల్ యాడ్స్‌పై రూ. 2.98 కోట్లు ఖర్చు చేసి బీజేపీ గెలిచింది.  మధ్యప్రదేశ్‌లో గూగుల్ యాడ్స్‌పై రూ.2.81 కోట్లు ఖర్చుచేసి బీజేపీ గెలిచింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1.48 కోట్లు ఖర్చు చేసి బీజేపీ గెలిచింది. బీజేపీకి చెందిన రెండు యాడ్స్ 10 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు నెటిజన్స్‌కు చూపబడ్డాయి.  ఒక్కోదానిపై రూ. 30 లక్షలు ఖర్చు వచ్చింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Rashtra Samithi
  • bjp
  • brs party
  • congress
  • Google Ads -2023

Related News

That's why I resigned from BRS.. Kadiam Srihari's key comments

Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

కవిత అరెస్ట్‌తోనే బీఆర్ఎస్‌పై నా నమ్మకం కుదేలైంది. ఇది ఒక్క లిక్కర్ కేసు మాత్రమే కాదు. ఇది ఆ పార్టీ నేతల అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉండగా రాష్ట్ర వనరులన్నింటినీ తమ కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంది.

  • CM Revanth Reddy

    Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • Kavitha to resign from MLC post.. Key press meet afterwards!

    Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !

Latest News

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd