BJP Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో తమిళిసై, రాధిక, కుష్బూ
BJP Star Campaigners : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తరఫున తెలంగాణలో ప్రచారం చేసే ప్రముఖుల జాబితా వెల్లడైంది.
- By Pasha Published Date - 03:39 PM, Tue - 23 April 24

BJP Star Campaigners : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తరఫున తెలంగాణలో ప్రచారం చేసే ప్రముఖుల జాబితా వెల్లడైంది. ఈ లిస్టును కేంద్ర ఎన్నికల సంఘానికి కాషాయ పార్టీ సమర్పించింది. ఈ లిస్టులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఉన్నారు. ఆమెతో పాటు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో(BJP Star Campaigners) సినీ నటి ఖష్బూ, రాధిక, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈసారి తమిళనాడులోని చెన్న్ సౌత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణలో గవర్నర్‌గా అత్యున్నత హోదాలో సేవలందించిన తమిళిసై ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టనున్నారు. తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని తమిళిసై చెబుతుంటారు. తెలుగులోనూ కొంతవరకు ఆమె మాట్లాడగలరు. అంటే ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె తెలుగులో పదాలను ప్రయోగించి రాష్ట్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేయనున్నారన్న మాట. ప్రధాని మోడీ నాయకత్వంలో అందుతున్న సంక్షేమ పాలన గురించి వివరించి, బీజేపీ అభ్యర్థులకు ఓటువేయాలని ప్రజలను తమిళిసై కోరనున్నారు.
Also Read :Childrens Seats : పేరెంట్స్ పక్కనే పిల్లలకు సీటు.. ఎయిర్ లైన్స్‌కు ఆదేశాలు
మొత్తం మీద కొన్ని నెలల క్రితం వరకు ఆమె నుంచి న్యూట్రల్ మాటలను విన్న తెలంగాణ ప్రజలు.. త్వరలోనే తెలంగాణ ఎన్నికల ప్రచారం వేదికగా తమిళిసై నోటి నుంచి పదునైన విమర్శలను కూడా వినబోతున్నారు. తమిళిసై గవర్నర్‌గా పనిచేసిన టైంలో పలు సందర్భాల్లో అప్పటి సీఎం కేసీఆర్‌పై బాహాటంగా విమర్శలను చేసేవారు. ఇప్పుడు రాజకీయ చతురతను మేళవించి తమిళిసై చేయబోయే ప్రసంగాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.