HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bjp Target On Kcr Ktr

BJP Target : కేసీఆర్..కేటీఆర్ లను టార్గెట్ చేసిన బిజెపి..వారిపై బలమైన నేతలు బరిలోకి..?

బిజెపి సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లను టార్గెట్ గా పెట్టుకుందనే వార్త వినిపిస్తుంది

  • Author : Sudheer Date : 01-09-2023 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP Target on KCR KTR
BJP Target on KCR KTR

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా బిజెపి (BJP)ని అధికారంలోకి తీసుకరావాలని మొదటి నుండి మోడీ ట్రై చేస్తూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే బయట రాష్ట్రాల్లో బిజెపి కి మంచి పట్టు ఉంది..కొన్ని రాష్ట్రాల్లో అధికారం చేపట్టారు..మరికొన్ని చోట్ల అధికపార్టీ కి ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిజెపిని పెద్దగా ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి అధిష్టానం చూస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి..సీఎం అయినా కేసీఆర్ (CM KCR)..గత రెండు సార్లు తెలంగాణ లో విజయకేతనం ఎగురవేసి..ఇప్పుడు మూడోసారి అధికారం చెప్పట్టాలని చూస్తున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పటీకే టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ (BRS) గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈసారి తెలంగాణ లో విజయం సాధించి..జాతీయ స్థాయిలో పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వకూడదని బిజెపి గట్టి ప్రయత్నాలే చేస్తుంది. తెలంగాణ బిజెపి నేతలకు (BJP Leaders) భారీ ఆఫర్లు అందజేస్తూ..పట్టును పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పటీకే పలువురికి కీలక బాధ్యతలు అప్పగించడం చేసింది.

Read Also : Earth Creature Vs Life On Moon : చంద్రుడిపైనా బిందాస్ గా బతకగలిగే జీవి ఏదో తెలుసా ?

మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అధికారపార్టీ బిఆర్ఎస్ ముందుగానే తమ అభ్యర్థులను (BRS Candidates) ప్రకటించి ఎన్నికల ప్రచారం (Election Campaign) మొదలుపెట్టింది. బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులకు ధీటుగా కాంగ్రెస్, బి‌జే‌పిలు సైతం అభ్యర్ధులని ప్రకటించే విషయంలో కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు బి‌జే‌పి సైతం తమకు పట్టున్న స్థానాల్లో బలమైన అభ్యర్ధులని నిలబెట్టేందుకు చూస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం రాజకీయా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. బిజెపి సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లను టార్గెట్ గా పెట్టుకుందనే వార్త వినిపిస్తుంది. అలాగే బిఆర్ఎస్ కీలక నేతలపై బిజెపి అగ్ర నేతలను బరిలోకి దించాలని చూస్తుందట. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఫై ఈటెల తో పాటు అరవింద్ లను బరిలోకి దించాలని , అటు కేటీఆర్ ఫై బండి సంజయ్ ని దింపాలనే ప్లాన్ లో ఉందట.

ఈసారి కేసీఆర్ గజ్వేల్ (KCR Gajwel) తో పాటు కామారెడ్డి (Kaamareddy) లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మొదట నుంచి గజ్వేల్ లో కే‌సి‌ఆర్ పై తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ (Etela Rajender) చెబుతూ వస్తున్నారు. దీంతో గజ్వేల్ లో ఈటలని బరిలో దింపి, కామారెడ్డిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ (Dharmapuri Arvind)ని బరిలో దింపాలని బిజెపి అధిష్టానం చూస్తుందట. అటు సిరిసిల్లలో కే‌టి‌ఆర్ (KTR) పై బండి సంజయ్‌ (Bandi Sanjay)ని పోటీకి దింపాలని భావిస్తోందట. అలాగే సిద్ధిపేటలో హరీష్ రావు (Harish Rao)పై బూర నర్సయ్య గౌడ్, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ పోటీ చేయనున్నారని వినికిడి. మరి నిజంగా వీరిని ఆలా దింపుతుందా..లేదా అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Assembly Elections
  • bjp
  • BJP Target on KCR KTR
  • BJP Telangana
  • telangana

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

  • Meeseva

    Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Sangareddy Malabar

    Malabar Gold & Diamonds Showroom : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్‌ ప్రారంభం

Latest News

  • Renu Desai : సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలను ఖండించిన రేణుదేశాయ్

  • Summer Holidays : స్మార్ట్ ఫోన్ మాయాజాలం.. మారుతున్న బాల్యం!

  • Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

  • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd