HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Should Be Overthrown Together Mlc Kavita Interview

MLC Kavitha: బీజేపీని అందరం కలిసి గద్దె దించాలి.. కవిత ఇంటర్వ్యూ..!

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో ప్రతిపక్షాల ఐక్యత, కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై మాట్లాడారు.

  • Author : Gopichand Date : 24-02-2023 - 6:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha, chandrababu
Mlc Kavitha

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో ప్రతిపక్షాల ఐక్యత, కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై మాట్లాడారు.

ప్రతిపక్షాలు ఏకమవ్వడంలో సవాళ్లు ఏమీ లేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే అన్నారని, కానీ దేశంలో అన్ని చోట్లలో కాంగ్రెస్ కి బలం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 4 వేలకుపైగా ఎమ్మెల్యే స్థానాలు ఉంటే, అందులో కాంగ్రెస్కు కేవలం 6300 వరకు సీట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కలిపి దేశలలో 2 వేట ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవని, మిగితా స్థానాలు ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్నాయని చెప్పారు అయినా కూడా తామే ప్రతిపక్ష పార్టీలకు నేతృ త్వం వహిస్తామని కాంగ్రెస్ అంటోందన్నారు. వివక్షాలపై కూర్చొని పని చేయాలని కాంగ్రెస్ భావిస్తే.. ఆ పార్టీ అహంకారాన్ని వదిలిపెట్టాలని, వాస్తవాలను గ్రహించాలని, దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.

కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిమాలకు ఎలా నేతృత్వం వహిస్తుందని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిజీగా ఉండడం వల్ల ఖమ్మం సభకు వారిని ఆహ్వానించలేదని వెల్లడించారు. ఏప్రిల్ 14న జరిగే సభకు మమతా. -బెనర్జీకి ఆహ్వానం వెళ్లిందో లేదో తనకు తెలియదని, కానీ మమతా బెనర్జీతో విబేధాలు ఏమీ లేవని, ఒకసారి కేసీఆర్ కూడా వెళ్లి కలిశారని చెప్పారు. యూపీఏ కూటమిలో ఉన్న అనేక పార్టీలకు కేవలం రెండు మూడు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయని, పెద్ద పార్టీల్లో డీఎంకే తప్పా మిగితా ఇతర పార్టీలు యూపీఏలో లేవని చెప్పారు. ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం ఏమిటి అనేదే ప్రధానమని స్పష్టం చేశారు.

దేశాన్ని సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయని, అయినా కూడా ఇంటింటికి తాగునీరు, విద్యుతు ను అందించలేకపోయాయని, దేశంలో ఈ పరిస్థితిలో ఉండడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని ఆరోపించారు. దేశానికి మంచి జరగాలంటే ఆ రెండు పార్టీలు కాకుండా ప్రత్యామ్నాయం రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, కేరళలో పినరాయి విజయన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనుల వల్ల మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. దేశం మారుతుందని 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు అంతా భావించారని, కానీ దేశం ఏం మారిందని ప్రశ్నించారు. కీలకమైన హామీలను అమలే చేయలేదని, ఉద్యోగాలు కల్పించలేదని, నల్లధానాన్ని విదేశాల నుంచి వెనక్కి తీసుకురాలేదని, రూపాయి విలువ పడిపోవడాన్ని కట్టడి చేయలేదని పేర్కొన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లను ఎందుకు జారీ చేయడం లేదని అడిగారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోనే సమస్య అని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని కాంగ్రెస్.. ఎదుర్కొంటుందా లేదా అని ఆ పార్టీ ఆలోచించుకోవాలని, బీజేపీకి గద్దె దించాలన్న ఉద్దేశముంటే దాన్ని ఎదుర్కొలేని పరిస్థితుల్లో, తక్కువ సీట్లు వచ్చే అవకాశమున్న చోట్లు క్షేత్రస్థాయిలో అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. బీజేపీని గద్దె దించకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తాము భావిస్తున్నామని తెలిపారు. విపక్షాల్లో అందరం కలిసి బీజేపీని గద్దె దించుతామని తెలిపారు.

Also Read: Modi: పాకిస్తాన్‌కు మోదీ కావాలి… నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో!

పవన్ ఖేర అరెస్టుపై స్పందిస్తూ దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తోందని, కేంద్ర ప్రభుత్వం నియం తృత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందుకు విపక్షాలు అన్నీ కలిసిరావాలని, కాంగ్రెస్ కలిసిరాకున్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రాంతీయ పార్టీలకు బలం ఉందని తెలిపారు.

కాంగ్రెస్ పీనరీ ముందు చత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో ఈడీ దాడులు జరిగాయని, విపక్షాలు సమావేశాలు పెట్టుకున్నా కూడా భయపడుతున్నారంటే దేశం ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతు వస్తోందని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. తాను తినను తిననివ్వడని ప్రధాని మోదీ చెబుతుండేవారని, కానీ జనవరి 25వ తేదిన హిండెన్బర్గ్ తర్వాత కొంత మందిని కాపాడడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి ఉన్న అవినీతిరహిత ఇమేజ్ ఇప్పుడు లేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని, వాటిని అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని విమర్శించారు.

ఈడీ, సీబీఐలను అడ్డంపెట్టుకొని భయపెట్టాలని చూస్తే సమస్య లేదని, తమపై చర్యలు తీసుకోవచ్చు. అదే సమయoలో ఆదానీపై కూడా తీసుకోవాలని అని అన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. తాము దర్యాప్తు సంస్థలను స్వాగతిస్తున్నామని, ఆదానీ ఎందుకు స్వాగతించడం లేదని అడిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిదికాదని అన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోదీ వెళ్లే ముందే ఈడీ వెళ్తుందని అందరికీ తెలుసన్నారు. వ్యవస్థను నాశనం చేసు తెస్తున్నారని, సీబీఐ, ఈడీ ఎన్నికల సంఘం, ఐబీ, పోలీసు వంటి సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని అనుకోవడానికి లేదని, ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అనే మోనర్లు దేశంలోనూ అమలు చేయాలన్న ఉద్దేశంతో. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చాలని వివరించారు. దేశానికి మంచి చేయాలని తాము ముందుకొస్తే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 2014కు ముందు ప్రధాని మోదీ చెప్పిన గురజాత్ మోడల్ కు, ఇప్పుడు తెలంగాణ మోడల్ మొత్తం వేర్వేరని, గుజరాత్ కంటే తెలంగాణ మోడల్ ఉత్తమమైనదని, ఫలితాలు కళ్లముందు ఉన్నాయని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • MLC Kavitha
  • telangana
  • ts politics

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • Congress ranks call for movement in wake of National Herald case

    నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd