Public Meeting Cancelled: మునుగోడులో బీజేపీ బహిరంగ సభ రద్దు.. కారణమిదే..?
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 31న నియోజకవర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
- Author : Gopichand
Date : 29-10-2022 - 10:46 IST
Published By : Hashtagu Telugu Desk
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 31న నియోజకవర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళికలు రచించింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని చెప్పారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఈ సభను రద్దు చేస్తున్నట్టుగా వివేక్ వెంకటస్వామి తెలిపారు. అదేరోజు నియోజకవర్గంలో మండల స్థాయి సమావేశాలను నిర్వహిస్తామని వివరించారు. ఈ సభలకు బీజేపీ ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
“మేము అనుమతి కోసం పోలీసులను సంప్రదించాం. ప్రచారానికి చివరి రోజు కావడంతో అనేక ర్యాలీలు ఉండటంతో బహిరంగ సభ సాధ్యం కాదని పోలీసులు చెప్పారు” అని బిజెపి ప్రచార కమిటీ ఛైర్మన్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. అక్టోబర్ 31న పార్టీ మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని వివేక్ స్పష్టం చేశారు. నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో నడ్డా సమావేశం రద్దు కావటం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: TS BJP : తెలంగాణ బీజేపీ నేతలపై..హైకమాండ్ ఆగ్రహం..!!
ప్రణాళికల మార్పు వ్యూహాత్మక ఎత్తుగడ అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్ రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరుపనున్నారు. అక్టోబరు 31న జరిగే సమావేశంపై బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, దీని వల్ల రాష్ట్ర పార్టీ యూనిట్.. పోలీసుల అనుమతి కోసం ఒత్తిడి చేయకపోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.