Bandi Sanjay: విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు…రైతుబంధు డబ్బులెక్కడ కేసీఆర్..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో రైతు బంధు నిధులు విడుదల చేయడంలో ఎందుకు జాప్యం అంటూ ప్రశ్నించారు.
- By Bhoomi Updated On - 05:16 PM, Thu - 9 June 22

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో రైతు బంధు నిధులు విడుదల చేయడంలో ఎందుకు జాప్యం అంటూ ప్రశ్నించారు. చాలామంది రైతులు దుక్కి దున్ని విత్తనాలు విత్తేందుకు రెడీగా ఉన్నారని…కానీ రైతు బంధు డబ్బులు మాత్రం పడలేదని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇదే విషయంపై బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల కంట కన్నీరు వస్తుంటే…ఫాంహౌజ్ కేసీఆర్ మాత్రం పన్నీరు ఒలుకుతోందని సటైర్లు విసిరారు. రైతులకు పంటల పెట్టుబడి కింద కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు పథకం నిధులు సకాలంలో రిలీజ్ కావడంలేదని ఆరోపించారు.
సకారంలో రైతులకు రైతు బంధు అందకుంటే దాని వల్ల లాభం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేశారు. చాలామంది రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్నారు. అయితే పెట్టుబడి డబ్బుల కోసం రైతు బంధు నిధుల కోసం ఎదురుచూస్తున్నారని వాపోయారు. ఈ పరిస్థితిని గమనించి వెంటనే రైతు బంధు కింద నిధులు విడుదల చేయాల్సిన 7,500కోట్లు రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రైతులకు లక్షమేర రుణమాఫీని అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు కానీ నేపథ్యంలో ఆ రుణాలకు వడ్డీలు కడుతూ ఇప్పటికే రైతన్నలు చితికిపోయారని విచారం వ్యక్తం చేశారు.
Related News

Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ సీపీ రివ్యూ మీటింగ్
హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పో