Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌తో లింక్ ?
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్ జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
- By Pasha Published Date - 04:16 PM, Thu - 4 April 24

Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్ జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం బయటికొచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పుడు వెల్లడైంది. వారి ఫోన్లను ట్యాప్ చేసిన తర్వాతే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అలర్ట్ అయిందని భావిస్తున్నారు. మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరగగా.. నాటి ఎస్‌ఐబీ ఓఎస్డీ రాధాకిషన్ రావు టీమ్(Phone Tapping Case) సీసీ కెమెరాలు, మైకులను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనుమానితులుగా ఉన్న బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్‌లకు నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లినట్లు తేలింది. విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం కామనే అయినా.. నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడంపై దుమారం రేగింది. ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లినట్లు తాజా విచారణలో తేలింది.అయితే ఆ విమానం ఓ బీఆర్ఎస్ కీలక నేతదిగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
Also Read :Tea Man : హార్డ్ కోర్ ఫ్యాన్.. ప్రధాని మోడీకి టీ ఇవ్వాలనేదే చిరకాల వాంఛ
- 2022 అక్టోబర్ 26న అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు.
- మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులు పార్టీ మారేందుకుగానూ ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున డీల్ కోసం రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ మంతనాలు జరిపారు.
- తమ ఎమ్మెల్యేలను కొనేసి బీఆర్ఎస్ సర్కారును పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఆరోపించారు.
- ప్రస్తుతం ఈ కేసులోని చాలామంది నిందితులు బెయిల్‌పై బయటకు రాగా.. కేసు కొనసాగుతూనే ఉంది.