MLC Kavitha: జాగృతి ఆధ్వర్యంలో21న యూకేలో బతుకమ్మ సంబరాలు
యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
- By Balu J Published Date - 02:37 PM, Tue - 3 October 23

MLC Kavita: హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఈనెల 21న నిర్వహించబోయే వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ వారితోపాటు, ప్రవాసి భారతీయులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… బతుకమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉన్నటువంటి భారత్ జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండగలకు వివిధ దేశాల్లో ప్రాచుర్యం కలగడం సంతోషంగా ఉందని తెలిపారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారతజాగృతి యూకే విభాగాన్ని కల్వకుంట్ల కవిత అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి యుకే అధ్యక్షులు బల్మురి సుమన్ , టీ యస్ ఫుడ్స్ చైర్మన్ & భారత్ జాగృతి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సాగర్ , భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి , నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Virat Kohli: కోహ్లీ క్రీజులో ఉన్నంత వరకు.. ఇండియా మ్యాచ్ ఓడిపోయినట్లు కాదు: పాకిస్థాన్ బౌలర్ ఆమిర్