Bandla Ganesh : కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి గా బండ్ల గణేష్..?
కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి
- By Sudheer Published Date - 11:32 AM, Sun - 8 October 23
బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh)..ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు సిద్దమయ్యాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో ఎన్నికల హడావిడి మొదలైంది. డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తమ అభ్యర్థులను ప్రకటించి..ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఇటు కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) పార్టీలు సైతం అతి త్వరలో తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధం అవ్వాలని చూస్తున్నాయి.
ఈసారి ఎన్నికలు నువ్వా..నేనా అనే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గత రెండుసార్లు ఈజీగా అధికారం చేపట్టిన బిఆర్ఎస్..ఈసారి మాత్రం కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఎదురుకోబోతున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ హావ బాగా పెరిగింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు పలు సర్వేలు చెపుతున్నాయి. అలాగే బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు..కాంగ్రెస్ లో చేరుతుండడం కూడా కాంగ్రెస్ కు బలం చేకూర్చినట్లు అవుతుంది. ఇక కాంగ్రెస్ హామీలు కూడా ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలతో పాటు సినీ పరిశ్రమ నుండి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటె నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈసారి కాంగ్రెస్ నుండి పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో ‘రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటావో నీ ఇష్టం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రెండు రూపాయిల 7’O Clock బ్లేడ్లో పీక కోసుకుంటా’ అంటూ గణేష్ చేసిన ఛాలెంజ్ సంచలనం రేపింది. ఈ ఒక్క డైలాగ్ బండ్ల గణేష్ ను రాజకీయాల్లో పాపులర్ చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది.
We’re now on WhatsApp. Click to Join.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బండ్ల గణేష్ ను ..కూకట్పల్లి (Kukatpally Constituency) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తున్నట్లు… బండ్ల గణేశ్ పేరును పరిశీలిస్తున్నట్టు గా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అధిష్ఠానం ఆయనతో మాట్లాడిందని ప్రచారం.. కూకట్ పల్లి అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. వీరు కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉంటారని భవిస్తూ..అలాగే గణేష్ బాగా పాపులర్ కావడం తో ఆయనైతేనే ఇక్కడ కరెక్ట్ అని భావిస్తున్నారు కాంగ్రెస్. కానీ గణేష్ మాత్రం ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనీ అనుకోవడం లేదట. ఈ విషయాన్నీ అధిష్టానానికి తెలిపినట్లు గణేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అదికారంలోకి వస్తాం జై కాంగ్రెస్’ అంటూ గణేష్ పేర్కొన్నారు. మరి ఎన్నికల సమయానికి గణేష్ ఏమైనా మనసు మార్చుకుంటారా..? అనేది చూడాలి.
Read Also : Chandrababu – Monday Verdicts : చంద్రబాబుకు సోమవారం కీలకం.. అన్ని కేసుల్లో తీర్పులు రేపే ?
నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.…
— BANDLA GANESH. (@ganeshbandla) October 8, 2023
Related News
KCR: కాంగ్రెస్ త్వరలో భూస్థాపితం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.ఈ రోజు శుక్రవారం పెద్దపల్లిలోని రామగుండంలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రకటించారు.