HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Wrote Letter To Cm Revanth Reddy

Bandi Sanjay : సీఎం రేవంత్‌ కు బండి సంజయ్ లేఖ

సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు.

  • Author : Kavya Krishna Date : 29-03-2024 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay (1)
Bandi Sanjay (1)

సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు.

ఆ లేఖలో..’సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఇంతవరకు కనీస స్పందన లేకపోవడం బాధాకరం.

We’re now on WhatsApp. Click to Join.

గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించింది. ఆ తరువాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చింది.

బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారు. ఫలితంగా పరిశ్రమతోపాటు అనుబంధంగా ఉన్న వార్పిన్, సైజింగ్, డైయింగ్ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత 27 రోజులుగా ఆసాములు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి డిమాండ్లు న్యాయమైనవే. వెంటనే మీరు స్పందించి సమ్మె విరమింపజేయడంతోపాటు ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను.

అట్లాగే పవర్ లూం కార్ఖానాలకు గత 24 సంవత్సరాల నుండి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ ను నిలిపివేయడంతో రెట్టింపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఆసాములు ఆ బిల్లులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. తక్షణమే విద్యుత్ బకాయిలను మాఫీ చేయడంతోపాటు విద్యుత్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాను. దీంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలి. నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించడంతోపాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని మనవి.’ అని పేర్కొన్నారు బండి సంజయ్‌
Read Also : Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • CM Revanth Reddy
  • congress
  • Textile Employees

Related News

KTR

కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

కేటీఆర్ ఈ అహంకారపూరిత వైఖరి, గ్రామాలను నిర్లక్ష్యం చేసే ధోరణి వల్లే బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోయిందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

  • Cm Stalin Counter To Amit S

    కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్

  • Congress

    Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం హావ !!

  • Vote Chori Rally

    Vote Chori : ‘ఓట్ చోరీ’పై ఈరోజు కాంగ్రెస్ మెగా ర్యాలీ

Latest News

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

  • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

  • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd