Bandi Sanjay: బండి సంచలన వ్యాఖ్యలు.. భైంసా పేరు మారుస్తాం..!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘భైంసా’ పేరు ‘మైంసా’గా మారుస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు.
- By Gopichand Published Date - 07:05 PM, Tue - 29 November 22

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘భైంసా’ పేరు ‘మైంసా’గా మారుస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసాలో బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘భైంసాలో హిందూత్వాన్ని రక్షించిన ప్రజలకు అండగా ఉండేందుకే బీజేపీ ఇక్కడకు వచ్చింది. భైంసాకు రావాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితిని మార్చితీరుతాం. భైంసా నుంచి ఎంఐఎంను తరిమికొడతాం.’’ అని సంజయ్ అన్నారు.
తెలంగాణ ప్రజల నెత్తిన రూ.5 లక్షల కోట్ల అప్పు భారాన్ని సీఎం కేసీఆర్ మోపారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. భైంసాలో ఆయన మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను.. అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌దని ఆయన విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే.. తెలంగాణను మాత్రం అధోగతిపాలు చేశారని విమర్శించారు.

Related News

Jagan-KCR : మోసం గురూ..! అన్నదమ్ముల రాజకీయ చతురత!!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లను (Jagan-KCR) రాజకీయంగా వేర్వేరుగా చూడలేం.