Balagam Mogiliah : ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య ఇక లేరు..
మొగిలయ్య దంపతులకు(Balagam Mogiliah) ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇస్తామని, వైద్య ఖర్చులు భరిస్తామని పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్‌లో ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
- By Pasha Published Date - 08:26 AM, Thu - 19 December 24

Balagam Mogiliah : ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య ఇక లేరు. ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో డయాలసిస్ చేయించుకుంటూ ఏడాది కాలంగా మొగిలయ్య మంచానికే పరిమితం అయ్యారు. ఈక్రమంలో ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మొగిలయ్య మృతి పట్ల బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్దండి, తోటి నటినటులు, గ్రామస్తులు సంతాపం ప్రకటించారు.
Also Read :KKR Captaincy: కేకేఆర్ కెప్టెన్ అతడేనా.. హింట్ ఇచ్చిన బీసీసీఐ!
మొగిలయ్య వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రం వాస్తవ్యుడు. కామెడీయన్, డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌పై నిర్మించిన బలగం సినిమాలో మొగిలయ్య దంపతులు నటించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో మానవ సంబంధాలను వివరిస్తూ ఆయన చేసిన గానం ‘తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి’ అనే పాట ప్రజల మది దోచింది. ఆ సన్నివేశమే బలగం సినిమాలో హైలెట్‌గా నిలిచింది. దీంతో మొగిలయ్య దంపతులకు పాపులారిటీ వచ్చింది. మొగిలయ్య వైద్య ఖర్చుల కోసం బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్దండి, చిత్ర యూనిట్ ఆర్థిక సాయం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొగిలయ్యకు దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసింది. మొగిలయ్య దంపతులకు(Balagam Mogiliah) ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇస్తామని, వైద్య ఖర్చులు భరిస్తామని పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్‌లో ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మొగిలయ్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం స్పీకర్ గడ్డం ప్రసాద్ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
Also Read : Shailajanath: మాజీ సీఎం జగన్‌ని కలిసిన కాంగ్రెస్ నేత శైలజానాథ్.. వైసీపీలోకి ఖాయమేనా?
- మొగిలయ్య అసలు పేరు దర్శనం మొగిలయ్య.
- ఈయన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో జన్మించారు.
- 12మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు.
- వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా ఆయన స్థిరపడ్డారు.
- వాయిద్య ప్రదర్శనలతో కుటుంబ పోషణ చేసుకుంటున్న మొగులయ్యను కరోనా రోడ్డుపైకి లాగింది.
- కుటుంబపోషణ కష్టతరమై, దీనావస్థలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి గత్యంతరం లేక నలుగురినీ యాచించాల్సిన దుస్థితి ఏర్పడింది.
- పాఠ్యపుస్తకంలో తన గురించి ఉన్న పాఠాన్ని చూపుతూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ కనిపించాడు.
- ఆదరణ కోల్పోయిన కళతో భిక్షమెత్తుకుంటున్న కళాకారుడి దుస్థితిని చూసి. .భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడే అవకాశం దక్కింది.