Gang Raped: వరంగల్‌లో దారుణం.. ఆటోలో వివాహితపై సామూహిక అత్యాచారం
వరంగల్ (Warangal)లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ సహా అతడి స్నేహితులు అత్యాచారాని (Gang Raped)కి ఒడిగట్టారు.
- Author : Gopichand
Date : 30-04-2023 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
వరంగల్ (Warangal)లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ సహా అతడి స్నేహితులు అత్యాచారాని (Gang Raped)కి ఒడిగట్టారు. హనుమకొండ నయీంనగర్ సమీపంలో నివసిస్తున్న వివాహిత ఏప్రిల్ 27న రాత్రి 12 గంటల సమయంలో కేయూ క్రాస్ వద్ద రోడ్డుపై వెళుతున్న ఆటోను ఎక్కి.. తనను రంగ్‌బార్ వద్ద దింపాలని డ్రైవర్‌ను కోరారు. మహిళను ఎక్కించుకున్న డ్రైవర్ రాకేశ్.. స్నేహితులైన ఆటో డ్రైవర్లకు ఫోన్ చేయగానే కొద్దిసేపటికే వాళ్లు వచ్చి ఆటో ఎక్కారు. భీమారం వైపు తీసుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ నయీంనగర్ సమీపంలో నివసించే వివాహిత ఈ నెల 27న పనిపై బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో కేయూ క్రాస్ వద్ద ఆటోను ఆపి రంగ్‌బార్ వద్ద దింపాలని కోరింది. సరేనని ఆమెను ఎక్కించుకున్న డ్రైవర్ రాకేశ్ తన స్నేహితులైన ఆటో డ్రైవర్లుకు ఫోన్ చేశాడు.వాళ్లిద్దరూ వచ్చి ఆటో ఎక్కగానే ఆటోను రాకేష్ ముందుకు పోనిచ్చాడు.
Also Read: Shooting In America: అమెరికాలో మరోసారి భీకర కాల్పులు.. ఐదుగురు మృతి.. మృతుల్లో చిన్నారి కూడా
ఆటో వివాహిత చెప్పిన చోటుకు కాకుండా భీమారం వైపు వెళ్తుండడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా ఆమెను బెదిరించి ఆటోలోనే అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చెప్పిన రంగ్‌బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే వివాహితను వదిలిపెట్టమని వారు బెదిరించినట్లు సమాచారం. అనంతరం ఇంటికెళ్లిన ఆమె ఈ దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ కేసులో పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు.