HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Are They Going To Change The Name Of The Brs Party To Trs What Ktrs Comments Mean

BRS Party : బీఆర్ఎస్‌ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ?

‘‘బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. మాది ఒక ప్రాంతీయ పార్టీ’’ అని ఇటీవలే కేటీఆర్(BRS Party) స్పష్టం చేశారు.

  • By Pasha Published Date - 01:53 PM, Thu - 24 April 25
  • daily-hunt
Brs Party Name Change To Trs Ktr Comments

BRS Party : భారత రాష్ట్ర సమితి (BRS) పేరును తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)గా మార్చబోతున్నారా ? వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ఈనెల 27న(ఆదివారం)  జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో దీనిపై ప్రకటన చేస్తారా ? అనే కోణంలో ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ పేరు మార్పుపై జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇంతకీ అవేమిటో చూద్దాం..

Also Read :Shimla Agreement : ‘సిమ్లా ఒప్పందం’ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్.. ఏమిటిది ?

కుండబద్దలు కొట్టేలా చెప్పేసిన కేటీఆర్ 

‘‘బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. మాది ఒక ప్రాంతీయ పార్టీ’’ అని ఇటీవలే కేటీఆర్(BRS Party) స్పష్టం చేశారు. దీంతో పార్టీకి పెట్టిన బీఆర్ఎస్ అనే పేరును కొనసాగిస్తారా ? లేదా ? అనే దానిపై డైలమా ఏర్పడింది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే బలమైన సంకల్పంతో కేసీఆర్ తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చారు.ఈ విధంగా పేరును మార్చడంలో కేసీఆర్ కుమార్తె కవిత కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ విధంగా పార్టీ పేరు మార్పును మొదటి నుంచే వ్యతిరేకిస్తున్న కేటీఆర్.. ఇప్పుడు బహిరంగంగా బయటపడ్డారు. తమది ప్రాంతీయ పార్టీయే అని కుండబద్దలు కొట్టేలా చెప్పేశారు.

Also Read :Pak Missile Tests: భయపడ్డ పాక్.. నేడు, రేపు కరాచీలో క్షిపణి పరీక్షలు

ఫుల్ క్లారిటీతో కేటీఆర్‌

రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి రాలేదని కేటీఆర్ అంటున్నారు.  బీఆర్ఎస్‌తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలన్నీ తిరిగి అధికారంలోకి వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ మాటలను బట్టి ప్రాంతీయ పార్టీగానే బీఆర్ఎస్‌కు భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. జాతీయ రాజకీయాల ఆలోచనను వదిలేసి, ప్రాంతీయవాదాన్ని భుజానికి ఎత్తుకుంటేనే బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా కేటీఆర్ వాదనతో ఏకీభవిస్తున్నారు. జాతీయ రాజకీయ పార్టీగా ఎదగాలంటే దీర్ఘకాలిక వ్యూహం అవసరం. కనీసం ఏదైనా ఒక రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుంటే.. ఇతర రాష్ట్రాల్లోకి పార్టీని విస్తరించడం ఈజీ అవుతుంది. ఉన్న అధికారాన్ని కూడా కోల్పోయి.. ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించడం అనేది అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను టీఆర్ఎస్ పేరుతోనే నిర్వహించాలని కొందరు నాయకులు కేసీఆర్‌ను కోరారట.గతంలో ఒకానొక సమయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే.. పార్టీ పేరు మార్పుపై చర్చ  జరుగుతోందని వెల్లడించారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును ఇతరులకు కేటాయించకుండా ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • brs party
  • kavitha
  • kcr
  • ktr
  • trs

Related News

Brs

BRS : బిఆర్ఎస్ పార్టీకి భారీగా నిధుల కొరత

BRS : తెలంగాణ లో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ గత కొద్ది నెలలుగా తీవ్రమైన రాజకీయ మరియు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం,

  • Kavitha

    Kavitha: పద్మశాలీలకు అన్యాయం జరుగుతుంది – కవిత

  • CM Revanth Reddy doesn't have that courage: KTR

    సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ ధైర్యం లేదు : కేటీఆర్‌

  • Ktr

    BRS Alleges : 9300 ఎకరాల కుంభకోణంలో రేవంత్‌..కేటీఆర్‌ షాకింగ్!

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    RK Rule : తెలంగాణలో ఆర్కే పాలన అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..అసలు ఎవరు ఆర్కే..?

Latest News

  • Gannavaram Mla : గన్నవరం ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!

  • Gannavaram : లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందజేసిన యార్లగడ్డ వెంకట్రావు

  • Mantena Ramaraju : కూతురి పెళ్లికి రూ.100 కోట్లు..తిరుమల శ్రీవారికి NRI రామరాజు కళ్లు చెదిరే విరాళం!

  • AR Rahman : తెలుగు ప్రేక్షకుల అపోహలను రెహమాన్ ‘పెద్ది’తో తూడ్చేస్తాడా..?

  • Komatireddy Brothers : కాంగ్రెస్ కు కుంపటిగా కోమటిరెడ్డి బ్రదర్స్..?

Trending News

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd