Shimla Agreement : ‘సిమ్లా ఒప్పందం’ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్.. ఏమిటిది ?
సిమ్లా ఒప్పందం వల్లే భారత్, పాక్(Shimla Agreement) మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యానికి వీలు లేకుండా పోయింది.
- By Pasha Published Date - 01:03 PM, Thu - 24 April 25

Shimla Agreement : కశ్మీరులోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును ఆపేసింది. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) అమలును ఆపేయాలని పాకిస్తాన్ యోచిస్తోందట. అయితే ఈ ఒప్పందం అమలును పాక్ ఆపేసినా.. భారత్‌కు పెద్దగా నష్టమేం ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఏమిటీ ఒప్పందం ? దానిలోని నిబంధనలు ఏమిటి ? తెలుసుకుందాం..
Also Read :Pak Missile Tests: భయపడ్డ పాక్.. నేడు, రేపు కరాచీలో క్షిపణి పరీక్షలు
సిమ్లా ఒప్పందంలో ఏముంది ?
- 1971 సంవత్సరంలో భారత్ – పాక్ మధ్య భీకర యుద్ధం జరిగింది.
- ఈ నేపథ్యంలో 1972 జులై 2న భారత్ – పాక్ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల మధ్యనున్న నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా, సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనేది ఈ ఒప్పందం సారాంశం.
- నాటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), అప్పటి పాక్ అధ్యక్షుడు జుల్ఫికార్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
- సిమ్లా ఒప్పందం వల్లే భారత్, పాక్(Shimla Agreement) మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యానికి వీలు లేకుండా పోయింది. ఈ ఒప్పందం అనేది కశ్మీరు అంశంలో భారత్‌కు ఓ కవచంలా ఉపయోగపడింది.
- ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాస్పద అంశాల పరిష్కారంలో మూడో దేశం లేదా అంతర్జాతీయ సంస్థల జోక్యానికి లైన్ క్లియర్ అవుతుంది.
- కశ్మీరు అంశంలో పాకిస్తాన్‌కు అండగా టర్కీ, చైనాలలో ఏదైనా ఒకదేశం రంగంలోకి దిగే సూచనలు ఉన్నాయి. గతంలోనూ టర్కీ, చైనాలు కశ్మీరు విషయంలో భారత్‌పై విషం కక్కాయి. వాటి మాటలను భారత్ ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొట్టింది.
Also Read :Gautam Gambhir: చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ బెదిరింపులు
- గతంలో భారత్, పాక్ మధ్య కుదిరిన సింధూ నదీజలాల పంపిణీ ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంకు నుంచి పాకిస్తాన్ భారీగా అప్పులు తీసుకుంది. భవిష్యత్తులో ప్రపంచ బ్యాంకు రంగంలోకి దీనిపై భారత్‌కు నచ్చజెప్పే అవకాశాలు ఉన్నాయి.