Telangana Jagruti: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. తక్షణమే అమల్లోకి!
ఈ నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
- By Gopichand Published Date - 10:25 PM, Thu - 14 August 25

Telangana Jagruti: తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థ బలోపేతంలో భాగంగా పలు అనుబంధ విభాగాలు, 11 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఈ నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యత
తెలంగాణ జాగృతి సంస్థాగత పదవులలో మొదటి నుంచి సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని కవిత పేర్కొన్నారు. కొత్తగా నియమించిన 11 జిల్లా అధ్యక్షులలో ఐదుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు. అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకాల్లో కూడా ఈ ప్రాధాన్యత కొనసాగిందని ఆమె తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు సంస్థ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Also Read: Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో పెను విషాదం నింపిన క్లౌడ్ బరస్ట్.. 46 మంది మృతి!
కొత్తగా నియమించబడిన బాధ్యులు
- ఆర్గనైజింగ్ సెక్రెటరీ: దూగుంట్ల నరేష్ ప్రజాపతి
- అధికార ప్రతినిధి: నలమాస శ్రీకాంత్ గౌడ్
- ఆదివాసీ జాగృతి: లోకిని రాజు (రాష్ట్ర అధ్యక్షులు)
- బీసీ జాగృతి: ఇత్తరి మారయ్య (రాష్ట్ర అధ్యక్షులు), ఈగ సంతోష్ ముదిరాజ్ (రాష్ట్ర ఉపాధ్యక్షులు)
- ఎంబీసీ & సంచార జాతుల విభాగం: రాచమల్ల బాలకృష్ణ
- సింగరేణి జాగృతి: ఎల్. వెంకటేష్ (రాష్ట్ర అధ్యక్షులు)
- మహిళా సమాఖ్య: మేక లలిత యాదవ్ (రాష్ట్ర ఉపాధ్యక్షురాలు)
- యువజన సమాఖ్య: కంచర్ల శివారెడ్డి (రాష్ట్ర అధ్యక్షులు)
- విద్యార్థి సమాఖ్య: మునుకుంట్ల నవీన్ గౌడ్ (రాష్ట్ర ఉపాధ్యక్షులు)
- సాహిత్య జాగృతి: కాంచనపల్లి గోవర్దన్ రాజు (రాష్ట్ర అధ్యక్షులు)
- రైతు జాగృతి: మంథని నవీన్ రెడ్డి (రాష్ట్ర అధ్యక్షులు)
- ఐటీ విభాగం: శశిధర్ గుండెబోయిన (రాష్ట్ర అధ్యక్షులు)
- మైనారిటీ ముస్లిం విభాగం: మహమ్మద్ ముస్తఫా (రాష్ట్ర అధ్యక్షులు)
- మైనారిటీ క్రిస్టియన్ విభాగం: జి. డేవిడ్ (రాష్ట్ర అధ్యక్షులు)
- ఆటో జాగృతి: మహమ్మద్ అబ్దుల్ సలీం (రాష్ట్ర అధ్యక్షులు)
కొత్తగా నియమించబడిన జిల్లా అధ్యక్షులు
- కామారెడ్డి జిల్లా: ఎదురుగట్ల సంపత్ గౌడ్
- యాదాద్రి భువనగిరి జిల్లా: చందుపట్ల సుజీత్ రావు
- జగిత్యాల జిల్లా: చెర్లపల్లి అమర్ దీప్ గౌడ్
- నిర్మల్ జిల్లా: భూక్యా జానూ బాయి
- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: వినోద్
- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా: రామిడి వెంకట్ రెడ్డి
- నాగర్ కర్నూల్ జిల్లా: దారమోని గణేష్
- నారాయణపేట జిల్లా: గవినోళ్ల శ్రీనివాస్
- సూర్యపేట జిల్లా: ఎస్. కృష్ణవేణి
- హన్మకొండ జిల్లా: పర్లపల్లి శ్రీశైలం
- భూపాలపల్లి జిల్లా: మాడ హరీష్ రెడ్డి