HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Another New Airport In Telangana Mp Nagesh Releases Master Plan Copy

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Author : Vamsi Chowdary Korata Date : 19-02-2026 - 12:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
bjp Mp Godam Nagesh
bjp Mp Godam Nagesh

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

  • ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు
  • మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన ఎంపీ నగేష్
  • త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరికొన్ని ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ పనులు మెుదలయ్యాయి. తాజాగా.. ఆదిలాబాద్ విమానాశ్రయంపై కూడా కీలక అప్డేట్ వచ్చింది.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్‌ ప్లాన్‌కు అనుమతి వచ్చిందని ఎంపీ గోడం నగేష్ వెల్లడించారు. త్వరలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి బుధవారం (ఫిబ్రవరి 18) తన క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని మీడియా ముందు విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు మరో 10 వేల ఎకరాల గుర్తింపునకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు రంగంలోకి దిగాక.. మాస్టర్ ప్లాన్‌లో కొంత మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. అనంతరం సోషల్ మీడియాలోనూ ఈ విషయాలను వెల్లడించారు.

ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది. జిల్లా ప్రజలకు ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజలు ఎయిర్ కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తున్నారు. నేడు ఆ కల సాకారం కాబోతుంది. ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష నేడు కార్యరూపం దాల్చుతోంది. అధికారికంగా మాస్టర్ ప్లాన్ ఆమోదించారు. త్వరలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందడుగు వేస్తోంది. మౌళిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వాటి ఫలితమే ఈ ముందడుగు. స్థానిక ప్రజల దీర్ఘకాల డిమాండ్‌ను నిజం చేయటం కోసం నిరంతర కృషి చేసిన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విమానాశ్రయం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కంటే ఎక్కువ. ఇది ఆదిలాబాద్‌ జిల్లాకు ఒక మలుపు. మా జిల్లాను ప్రధాన నగరాలకు అనుసంధానిస్తుంది, స్థానిక వ్యాపారాలు, రైతులకు మద్దతు ఇస్తుంది, మా గిరిజన, అటవీ ప్రాంతాలకు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఆదిలాబాద్ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.’ అని గోడం నగేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adilabad Airport
  • Approved Master Plan
  • bjp Mp Godam Nagesh
  • Godam Nagesh
  • Kinjarapu Rammohan Naidu
  • telangana
  • Union Minister Rammohan Naidu

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

  • Liquor Bottles

    మందుబాబులకు గుడ్ న్యూస్..

Latest News

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd