Ambati Rambabu : ఖమ్మంలో అంబటి రాంబాబుకు చుక్కలు చూపించిన టీడీపీ – జనసేన కార్య కర్తలు
శుక్రవారం ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు మంత్రి అంబటి రాంబాబు ఖమ్మం చేరుకున్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ - జనసేన శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగారు
- By Sudheer Published Date - 12:27 PM, Fri - 27 October 23

ఏపీలోనే కాదు తెలంగాణ లో కూడా వైసీపీ మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ – జనసేన (TDP-Janasena) కార్య కర్తలు. చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్ ను ఎక్కడిక్కడే ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట దేశాల్లోనూ చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతూ..వైసీపీ సర్కార్ (YCP Govt) ఫై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఖమ్మం (Khammam) చేరుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ – జనసేన శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి రాంబాబు కారు ను అడ్డుకొని ..ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అలాగే సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ భూతులు తిట్టారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..వైసీపీ సర్కార్ కాలం చెల్లిందని..వైసీపీ నేతలంతా జైలు కు వెళ్లడం ఖాయమంటూ వారంతా నినాదాలు చేసారు. కొంతమందైతే బండ బూతులు తిట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని అంబటి రాంబాబును అక్కడ నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
ఖమ్మంలో అంబటి రాంబాబుకి చుక్కలు చూపిస్తున్న ప్రజలు.. డౌన్ డౌన్ ys jagan అంటూ నినాదాలు#PichiJagan#AndhraPradesh #NalugellaNarakam #JaganLosingIn2024#ByeByeJaganIn2024 #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #JaganFailedCM #PsychoJagan#IdhemKarmaManaRashtraniki… pic.twitter.com/wTooNgZNYU
— Telugu Desam Party (@JaiTDP) October 27, 2023
Read Also : Simhachalam: సింహాచలం ఆలయంలోకి కుక్క ప్రవేశం, 2 గంటల పాటు మూసివేత