TG Inter Exams : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం..
ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5, 08,523 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1532 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 29,992 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేశారు.
- By Latha Suma Published Date - 02:31 PM, Mon - 3 March 25

TG Inter Exams : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎల్లుండి నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9 లక్షల 96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ ఫస్టియర్‌తో పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5, 08,523 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1532 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 29,992 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేశారు.
Read Also: World Wildlife Day : వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోడీ సఫారీ
ఇంటర్ బోర్డు అధికారులు ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ కోసం వెబ్‌సైట్‌లో ఉంచారు. మొదట కాలేజీల లాగిన్‌లలో ఉంచిన అధికారులు.. తాజాగా ఫస్ట్, సెకెండ్ ఇంటర్‌తో పాటు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్ టికెట్లను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ ఫస్టియర్..
మార్చి 5, 2025(బుధవారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 7, 2025(శుక్రవారం)- ఇంగ్లీష్ పేపర్-1
మార్చి 11, 2025(మంగళవారం) -మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
మార్చి 13, 2025(గురువారం)-మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మార్చి 17, 2025 (సోమవారం) -ఫిజిక్స్ పేపర్-1, ఎనకామిక్స్ పేపర్-1
మార్చి 19, 2025(బుధవారం) -కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
మార్చి 21,2025(శుక్రవారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
ఇంటర్ సెకండియర్..
మార్చి 6 , 2025(గురువారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మార్చి 10, 2025(సోమవారం)- ఇంగ్లీష్ పేపర్-2
మార్చి 12, 2025(బుధవారం) -మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
మార్చి 15, 2025(శనివారం)-మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చి 18, 2025 (మంగళవారం) -ఫిజిక్స్ పేపర్-2, ఎనకామిక్స్ పేపర్-2
మార్చి 20, 2025(గురువారం) -కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
మార్చి 22,2025(శనివారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు)
మార్చి 25, 2025(మంగళవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2
మార్చి 24, 2025(సోమవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
కాగా, తెలంగాణ విద్యాశాఖ గతంలో పేపర్ లీకేజీ వార్తల నేపథ్యంలో అప్రమత్తం అయింది. ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా పరీక్ష సమయంలో ఎగ్జామ్ సెంటర్ల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక పరీక్ష సమయానికి అరగంట(ఉదయం 8.30 కి) ముందే అభ్యర్థులు పరీక్ష హాల్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఇక ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేయనున్నారు. ఏ కారణం చేతనైనా విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకపోతే సంబంధిత కాలేజీల పైన చర్యలు ఉంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.