HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >All Eyes Are On The Third Date Telangana Election Result Day

Telangana Election : ఇక అందరి చూపు మూడో తేదీ పైనే

తెలంగాణ (Telangana)లో ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీల హోరా హోరీ పోరాటం అలా ఉంచి, ఈసారి డబ్బు, మద్యం పంపకాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

  • By Hashtag U Published Date - 11:17 AM, Thu - 30 November 23
  • daily-hunt
All Eyes Are On The Third Date Telangana Election Result Day
All Eyes Are On The Third Date Telangana Election Result Day

By: డా. ప్రసాదమూర్తి

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చివరి ఘట్టంగా తెలంగాణ (Telangana)లో పోలింగ్ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. ఎవరి ప్రచారం వారు సాగించారు. పథకాలు, హామీలు, వాగ్దానాలు, వాదోపవాదాలు అన్నీ ముగిశాయి. ఇక వోటర్ మధ్యలో ఏమి ఉందో మూడో తేదీన మాత్రమే అర్థమవుతుంది. తెలంగాణ (Telangana)లో ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీల హోరా హోరీ పోరాటం అలా ఉంచి, ఈసారి డబ్బు, మద్యం పంపకాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మొత్తం దేశానికి ఈ విషయంలో తెలంగాణ (Telangana) ఈ రకమైన దారి చూపిస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఎన్నికల సందర్భంగా 700 కోట్లు పై చిలుకు అధికారులు స్వాగతం చేసుకున్నారు. ఇక బయటపడని వివరాలు ఎవరి అంచనాలకూ అందనంత దారుణంగా ఉన్నాయి.

ఎన్నికల్లో ఎన్నడూ లేనంత ఉద్ధృతంగా మద్యం, నగదు పంపిణీ జరిగినట్టు మీడియా మొత్తం కోడై కూసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ తేదీ ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యే ఘడియ వరకు- ఈ మధ్యకాలంలో వేల కోట్లు చేతులు మారినట్టుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా అటు దేశంలో స్వాతంత్ర్యం వచ్చింది. ఇటు తెలంగాణ కూడా సిద్ధించింది. ఆ అమరుల స్వప్నం ఈ విధంగా నాయకులు సాకారం చేస్తున్నారా అనే ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల్లో పదేపదే తలెత్తుతోంది. దీనికి సమాధానం చెప్పాల్సిన నాయకులే అక్రమ మార్గంలో రాజకీయ లబ్ధి పొందడానికి అధికార దర్పాన్ని, అహంకారాన్ని, అంగ బలాన్ని అర్థ బలాన్ని, సమస్తాన్నీ వినియోగించుకుంటూ, పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలను కూడా రంగంలోకి దించారు. అందుకే నాయకులకు ప్రజలే సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉంటుందో అది ప్రజలే తెలుసుకోవాలి.

We’re Now on WhatsApp. Click to Join.

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే నాయకులు చివరి ప్రయత్నంగా కూడా ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం దగ్గర ఆంధ్ర, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వివాదాన్ని వినియోగించుకోవడానికి కూడా నాయకులు ప్రయత్నం చేసినట్టు మీడియాలో వార్తలు రావడం బాధాకరం. చివరి ప్రయత్నంగా ఎవరు ఏం చేసినా తెలంగాణ ప్రజలు ఇప్పటికే మైండ్ మేకప్ చేసుకుని ఉన్నట్టు పలు మీడియా సంస్థల సర్వేల ద్వారా అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న దశలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె రెండు నిమిషాల వీడియోను తన ట్విట్టర్ (X) అకౌంట్లో పెట్టారు. దాన్ని రాహుల్ గాంధీ షేర్ చేశారు. తనను సోనియా అమ్మ అని తెలంగాణ ప్రజలు ఎంతో గౌరవించారని, వారి గౌరవాన్ని నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తానని ఆమె అన్నారు. అంతేకాదు ఆత్మ బలిదానాలు చేసిన తన బిడ్డల కలలు నిజం కావాలని తెలంగాణ తల్లి కోరుకుంటున్నది అన్న సోనియా గాంధీ మాట అత్యంత ఉద్వేగభరితమైన భావాన్ని తెలంగాణ ప్రజల గుండెల వద్దకు మోసుకెళ్లింది. ఈసారి ఎన్నికలు తెలంగాణలో మొత్తం దేశానికి ఒక దారిని చూపే కీలక ఘట్టంగా పరిణమించింది.

తెలంగాణ తెచ్చిన వారికా, ఇచ్చిన వారికా అనే ఏకైక ఎజెండాలో ఎన్నికలు సాగాయి. సోనియాగాంధీ చేసిన ట్వీట్ లో దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి అన్న నినాదం కూడా ఈ ఎన్నికల్లో కీలకమైందిగా భావించాలి. పథకాల ప్రచారం మాట ఎలా ఉన్నా, ఇరుపక్షాల వాగ్దానాలు విషయం ఎలా ఉన్నా, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ మరో రూపంలో పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ ది కుటుంబ పాలన అన్న వాదనను బలంగా ముందుకు తీసుకువెళ్లారు. టిఆర్ఎస్ వారు గత ఏభై,ఆరవైఏళ్లుగా తెలంగాణను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మరోసారి ఆ పార్టీని నమ్మితే అంతా అంధకారమేనని బలంగా వాదిస్తూ ప్రజల ముందుకు వెళ్లారు. ఎటు తిరిగి ఇటు చూసినా చివరికి తెలంగాణ ప్రజల ముందు సెంటిమెంట్ ప్రధానంగా మారిపోయింది. మరోపక్క ఛత్తీస్గడ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికే తమ తమ అభిమతాలను ఓట్ల రూపంలో పదిలపరిచి ఉంచారు. అనేక మీడియా సంస్థలు ఎన్నెన్నో సర్వేలు చేశాయి. ఏది ఏమైనప్పటికీ 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. వాటిలో ఏ రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది ఒక అంచనా వస్తుంది.

మిగిలిన రాష్ట్రాల ఫలితాలు ఒక ఎత్తు, తెలంగాణ ఫలితం ఒక ఎత్తుగా ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ మీదనే పడింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కి, బిజెపికి కూడా అత్యంత ప్రాణప్రదమైన ఎన్నికలుగా వీటిని అందరూ భావిస్తున్నారు. చూడాలి, ప్రజల తీర్పు అలా ఉంటుందో. ఏ రాష్ట్రంలో ఓటరు తీర్పు ఏ విధంగా ఉన్నా, 70 ఏళ్ల భారత ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో డబ్బుతో ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చూసే నాయకుల హీనమైన హేయమైన ప్రయత్నాలు, మనం ఏం సాధించామో గుండెల మీద గుద్ది చెబుతున్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియ, ఫలితాల ప్రకటన ముగిసాక అసలైన హార్స్ ట్రేడింగ్ మాయాజాలం తెరమీదకు వస్తుంది. ఎన్నికలను అమ్మకాల కొనుగోళ్ళ మార్కెట్ మాయగా మార్చిన మహామహులకు గుణపాఠం నేర్పే రోజు ఎప్పుడొస్తుందో, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఈ దేశంలో వర్ధిల్లుతున్నట్టు గుర్తించాలి.

Also Read:  Telangana Polling Day 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assembly Elections 2023
  • hyderabad
  • polling
  • results
  • telangana
  • telangana elections

Related News

Rangareddy

Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

Rangareddy: రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నగరానికి సమీపంగా ఉండడం వల్ల ఇది ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా మారింది. గచ్చిబౌలి, మాధాపూర్, నానకరంరెడ్డి, షమ్షాబాద్, పటాంచెరు పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీలు స్థాపించబడ్డాయి

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

  • Hyd Bijapur Road

    HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి

Latest News

  • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

  • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

  • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd