ACB Raids : కాళేశ్వరం మాజీ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
కాళేశ్వరం(ACB Raids) ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాల్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు.
- By Pasha Published Date - 09:19 AM, Sat - 26 April 25

ACB Raids : కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ చీఫ్ ఇంజినీర్ (ఈఎన్‌సీ) హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేస్తోంది. ఇవాళ (శనివారం) తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట ఆదిత్య టవర్స్‌లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణలో ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇప్పటికే హరిరామ్ విచారణకు హాజరయ్యారు. ఫైనల్‌గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ఈ కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read :Donald Trump: భారత్, పాక్ నాకు సన్నిహిత దేశాలు.. ఉగ్రదాడిపై ట్రంప్ స్పందన ఇదే!
కాళేశ్వరం డిజైన్ రూపకల్పనలో హరిరామ్ కీలక పాత్ర
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ రూపకల్పనలో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. గజ్వేల్ ప్రాంత ఈఎన్‌సీగానూ పనిచేస్తున్నారు. కాళేశ్వరం(ACB Raids) ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాల్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. హరిరామ్ భార్య అనిత నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వాలంతరి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపాలు : ఎన్టీఎస్ఏ రిపోర్టు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్‌ఏ రిపోర్టులో ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లలో అనేక లోటుపాట్లు ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహారించిన అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై సీరియస్‌గా విచారణ చేపట్టాలని అధికారులకు కాంగ్రెస్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రోజు షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. దీనిలో అవినీతి చేసిన వారిని వదలబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఏసీబీ రైడ్స్ మొదలుకావడం గమనార్హం.