Kidnap Case : నిలోఫర్ ఆసుపత్రిలో ఆరు నెలల బాలుడు కిడ్నాప్
నిలోఫర్ ఆస్పత్రి ఆరునెలల బాలుడి కిడ్నాప్ కలలకం రేపుతుంది. కిడ్నాప్‌కు గురైన బాలుడి కోసం పోలీసులు గాలింపు
- By Prasad Published Date - 12:57 PM, Fri - 15 September 23

నిలోఫర్ ఆస్పత్రిలో ఆరునెలల బాలుడి కిడ్నాప్ కలలకం రేపుతుంది. కిడ్నాప్‌కు గురైన బాలుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కిడాప్న్ ఘటన జరిగి16 గంటలు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీలోఫర్ ఆస్పత్రి నుంచి 6 నెలల బాలుడు ఫైజల్‌ఖాన్‌ను ఓ మహిళ అపహరించినట్లు బాలుడి తల్లదండ్రులు ఆరోపిస్తున్నారు. గండిపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సల్మాన్ ఖాన్ దంపతుల రెండో కుమారుడు ఫైజల్ ఖాన్. గురువారం మధ్యాహ్నం నిద్ర లేకపోవడంతో మొదటి కుమారుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిన్నారికి చికిత్స అందిస్తుండగా, అతని తల్లి ఫరీదా బేగం రెండో బిడ్డ ఫైజల్ ఖాన్‌తో కలిసి మొదటి అంతస్తు వార్డులో కూర్చున్నారు. అక్కడ ఓ మహిళ ఫరీదా బేగం వద్దకు వచ్చింది. ఫరీదా బేగంతో కలిసి వివిధ అంశాలపై మహిళ మాట్లాడింది. అదే సమయంలో తల్లి ఫరీదా బేగం ఆసుపత్రి నుండి ఆహారం తీసుకోవడానికి వెళ్లి, బిడ్డను చూసుకోవాలని మహిళను అభ్యర్థించింది. ఆ సమయంలో ఆ మహిళ ఫైజల్ ఖాన్‌నితీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. తన కుమారుడు కనిపించకపోవడంతో ఫరీదా, ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిశీలించగా ఆస్పత్రిలో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.