Telangana RRR: తెలంగాణ ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు.. నిర్మాణ పనులను చేపట్టనున్న కేంద్రం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు టెండర్లు పడేలా విజయం సాధించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 10:17 AM, Sun - 29 December 24

Telangana RRR: రీజనల్ రింగ్ రోడ్డు (Telangana RRR) నిర్మాణ పనులలో పురోగతి వచ్చింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ.5,555 కోట్ల పనులకు సంబంధించి సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు నాలుగు రోడ్ల ఎక్స్‌ప్రెస్ వేకి కేంద్రం టెండర్లను పిలవనుంది. 4 భాగాలుగా రోడ్డు నిర్మించాలంది. రెండు సంవత్సరాల్లో ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నారు.
మంత్రి కోమటిరెడ్డి స్పందన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు టెండర్లు పడేలా విజయం సాధించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. విజయం లభించిన ఈ శుభదినం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాను అనేకసార్లు ఈ పనుల వేగవంతంపై కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
Also Read: Minister Kondapalli Srinivas: కూటమి మంత్రి.. బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారా? నిజమిదే!
టెండర్ వివరాలు
1వ ప్యాకేజీ: గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ. 1529.19 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
2వ ప్యాకేజీ: రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు వరకు 26 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ. 1114.80 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
3వ ప్యాకేజీ: ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు వరకు 23 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ. 1184.81 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
4వ ప్యాకేజీ: ప్రజ్ఞపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు వరకు 43 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ. 1728.22 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
5వ ప్యాకేజీ: రాయగిరి గ్రామం నుంచి తంగడ్ పల్లి గ్రామం వరకు వరకు 35 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ. 1547.04 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.