HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Great Achievement For That District A 2 Lane Road Turned Into 4 Lanes

Nationcal Highway : ఆ జిల్లాకు మహర్దశ.. 2 లైన్ల రోడ్డు 4 లైన్లుగా..!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-11-2025 - 3:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akkannapet Road
Akkannapet Road

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులు వస్తున్నాయి. ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట రహదారిని 4 లైన్లుగా మార్చనున్నారు. దీనికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకార్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతానికి శుభవార్త అందింది. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పర్యటనలో వెల్లడించారు. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ఈ ప్రాంతంలో రవాణా మెరుగుపడి, స్థానిక వ్యాపారాలకు, ప్రజల ప్రయాణానికి మరింత సౌకర్యంగా మారుతుంది.

శనివారం (నేడు) హుస్నాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్ (పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ) మరియు వాకిటి శ్రీహరి (బీసీ సంక్షేమం, మత్స్య అభివృద్ధి) కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చేప పిల్లల పెంపకంలో గత ప్రభుత్వంలో చిన్న చేప పిల్లలు పంపిణీ చేయడం వంటి కొన్ని పొరపాట్లు జరిగాయని విమర్శించారు.

హుస్నాబాద్‌లోని చెరువులకు ఇప్పుడు మూడు లక్షల చేప పిల్లలు ఇచ్చామని, మరో 60 వేల చేప పిల్లలు ఇవ్వాలని సంబంధిత మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఎల్లమ్మ చెరువుని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు చేపలు కొనుక్కునేలా అక్కడే ఒక చేపల మార్కెట్ ఉండాలని సూచించారు. అలాగే.. అసంపూర్తిగా ఉన్న మోడరన్ చేపల మార్కెట్‌ను వెంటనే పూర్తి చేయాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి కృషి చేస్తున్న గోపాల మిత్రల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, హుస్నాబాద్‌లో నిర్మించే వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించాలని.. ఒక వెటర్నరీ పోస్టును వెంటనే మంజూరు చేయాలని మంత్రి శ్రీహరికి వినతి పత్రం సమర్పించారు.

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 122.22 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో భాగంగా.. రాష్ట్రంలోని 26 వేల చెరువుల్లో ఉచితంగా 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేశామని వివరించారు.

తెలంగాణలోని ఐదు లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని.. చేపల ఉత్పత్తి కేంద్రాలని పెంచి, గణనీయంగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. గుర్తింపు పొందిన మత్స్యకారులకు రూ. 1.40 లక్షలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీహరి ఆకాంక్షలకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి సహకారంతో గురుకుల హాస్టల్స్ మధ్యాహ్న భోజన మెనూలో చేపల వంటకాన్ని (చేపల కూర) అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akkannapet Road
  • National highway
  • siddipet
  • telangana

Related News

Municipal Elections Telanga

ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు?

ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో GHMCతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది

  • Ias Officers Transfer In Te

    తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు

  • Telangana New Sarpanches

    సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్

  • Schools Closed Telangana

    తెలంగాణ లో 1,441 బడులు తాత్కాలికంగా క్లోజ్!

  • CM Revanth Reddy

    రేవంత్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు!

Latest News

  • మహిళా కమిషన్‌ విచారణకు హాజరైన నటుడు శివాజీ!

  • అనసూయ బాటలో నాగబాబు, శివాజీ అన్నది ముమ్మాటికీ తప్పే !

  • శివాజీకి సపోర్ట్.. అనసూయ పై ఫైర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి !

  • డ్రగ్స్ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిన హీరోయిన్ సోదరుడు ?

  • వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు .. టోకెన్లు లేకపోతే తిరుమ‌ల‌కి వెళ్లొద్దంటూ విశ్వక్‌సేన్ విజ్ఞప్తి !

Trending News

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

    • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

    • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd