Caste census Survey : 95 శాతం కులగణన సర్వే పూర్తి
Caste census Survey : ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే 95శాతం పూర్తైంది. 1.18 కోట్ల నివాసాల్లో 1.10 కోట్ల గృహాల్లో సమాచార సేకరణ పూర్తైనట్లు ప్రభుత్వం తెలిపింది
- By Sudheer Published Date - 08:45 AM, Thu - 28 November 24

రేవంత్ సర్కార్ (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే (Caste census Survey) ను చేపడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6 నుంచి ఈ సర్వే ను రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే 95శాతం పూర్తైంది. 1.18 కోట్ల నివాసాల్లో 1.10 కోట్ల గృహాల్లో సమాచార సేకరణ పూర్తైనట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సేకరించిన డేటా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కాగా అత్యధికంగా ములుగు జిల్లాలో 70.3శాతం డేటా కంప్యూటరైజ్డ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత యాదాద్రి జిల్లా నిలిచింది.
అటు GHMC పరిధిలో 80.5శాతం సర్వే పూర్తైనట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 95 శాతానికి పైగా సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను త్వరితగతిన పూర్తిచేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. అదే మాదిరిగా ఉద్యోగాలలో కూడా ఇదే మాదిరి రిజర్వేషన్లు కల్పించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. దీనిపైనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా ముడిపడి ఉంది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటె ఈ సర్వే ఫై రేవంత్ ప్రభుత్వానికి కవిత కీలక డిమాండ్లు చేసారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, కులగణన కోసం ఏర్పాటు చేసిన డిడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్వంతంత్రత ఇవ్వాలని, అన్నీ వసతులు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కులగణనపై బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు.
Read Also : Kohli Captain In IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. కింగ్‌కే పగ్గాలు అని చెప్పే కారణాలివే!