Omicron: హైదరాబాద్ లో ‘ఓమిక్రాన్’ కలకలం.. మూడు కేసులు గుర్తింపు!
తెలంగాణలోని హైదరాబాద్‌లో కొత్తగా గుర్తించిన ఓమిక్రాన్ కోవిడ్ వేరియంట్ మూడు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
- By Balu J Published Date - 11:56 AM, Wed - 15 December 21
తెలంగాణలోని హైదరాబాద్‌లో కొత్తగా గుర్తించిన ఓమిక్రాన్ కోవిడ్ వేరియంట్ మూడు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. సోకిన వారిలో ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 24 ఏళ్ల కెన్యా జాతీయుడు, సోమాలియా దేశస్తుడు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఈ కేసులు నమోదయ్యాయి. అయితే అధికారికంగా మూడు కేసుల వివరాలు తెలియాల్సి ఉంది.
కోల్‌కతాకు వెళ్తున్న మరో ఏడేళ్ల బాలుడు కూడా హైదరాబాద్‌కు రాగానే కొత్త వేరియంట్‌కు పాజిటివ్‌గా తేలింది. తెలంగాణ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు సమాచారం అందించింది. గతంలో నివేదించినట్లుగా, ‘ఓమిక్రాన్’ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇతర చర్యలతోపాటు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షా యంత్రాంగాన్ని పటిష్టం చేసింది. ప్రమాదంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించిన 11 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే అత్యధికంగా 16 కేసులు వెలుగుచూశాయి. తాజాగా మహారాష్ట్రలో ఎనిమిది, దిల్లీ, రాజస్థాన్‌లో నాలుగు చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కి పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కాగా రాజస్థాన్‌లో ఒమిక్రాన్ బారినపడిన వారంతా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Tags
Related News
Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.