3 Mysterious Deaths : ఆ మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు – సీఎం రేవంత్
3 Mysterious Deaths : ఇటీవల జరిగిన మూడు అనుమానాస్పద మరణాల గురించి ప్రస్తావిస్తూ.. కేటీఆర్ ఎందుకు వీటిపై స్పందించడంలేదని అనుమానాలు వ్యక్తం చేసారు
- By Sudheer Published Date - 08:30 PM, Wed - 26 February 25

తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన మూడు అనుమానాస్పద మరణాల గురించి ప్రస్తావిస్తూ.. కేటీఆర్ ఎందుకు వీటిపై స్పందించడంలేదని అనుమానాలు వ్యక్తం చేసారు.
Truth Bomb : ట్రూత్ బాంబ్.. వీడియో రిలీజ్ చేసిన వైసీపీ
మొదటిది రాజలింగ మూర్తి హత్య ( Rajalinga Murthy Murder ) కాగా.. రెండో హత్య సంజీవరెడ్డి (Sanjavareddy) అనే లాయర్‌ది. మూడో మరణం నిర్మాత కేదార్ (Kedar Selagamsetty) ది. దుబాయ్ లో జరిగిన ఈ మరణం సమయంలో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని ఆయన ఎవరని రేవంత్ ప్రశ్నించారు. అటు రాజలింగమూర్తికి, ఇటు కేదార్ కి కూడా లాయర్ సంజీవ రెడ్డేనని రేవంత్ చెప్పుకొచ్చారు.
కేదార్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యాపార భాగస్వామి మాత్రమే కాదు మిత్రుడు కూడా అని రేవంత్ పేర్కొన్నాడు. దుబాయిలో కేదార్ మరణం ఓ పెద్ద మిస్టరీనేనని , ఆ మిస్టరీ ఏమిటని కూడా ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఇటీవలే హైదరాబాద్ లో ఓ రాజకీయ ప్రముఖుడు ఇచ్చిన డ్రగ్స్ పార్టీ రాడిసన్ హోటల్ లో జరిగిందని… అందులో కేదార్ కూడా పాలుపంచుకున్నారని కూడా రేవంత్ అన్నారు.
Universal Pension Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. భారతదేశంలో అందరికి పెన్షన్..!
”కేసులలో ఉన్న వారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవ రెడ్డి, ఆ తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్..వీరి మరణాల వెనుక మిస్టరీ ఉంది. దీనిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు. ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం” అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణతో పాటు టాలీవుడ్ లోనూ పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి.