Ear Buds: అతి తక్కువ ధరకే స్టైలిష్ ఇయర్ బడ్స్.. ధర,ఫీచర్స్ ఇవే?
టెక్నాలజీ బాగా డెవలప్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో స్మార్ట్ ఫోన్లతో పాటు,
- By Nakshatra Published Date - 04:35 PM, Sun - 23 April 23
టెక్నాలజీ బాగా డెవలప్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో స్మార్ట్ ఫోన్లతో పాటు, స్మార్ట్ వాచ్ ల వినియోగం అలాగే ఇయర్ బడ్స్ ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ ఇయర్ బడ్స్ ని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలు కూడా కొత్త కొత్త ఇయర్ బర్డ్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా వింగ్స్ కంపెనీ నుంచి సూపర్ స్టైలిష్ లుక్స్ లో ప్రీమియం ఫీచర్స్ తో ఇయర్ బడ్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి.
మరి వాటి ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. క్రికెటర్ శుబ్ మన్ గిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వింగ్స్ కంపెనీ తాజాగా ధరలో ఇయర్ బర్డ్స్ ని విడుదల చేసింది. ఫాంటమ్ సిరీస్ లో వింగ్స్ ఫాంటమ్ 345 టీడబ్ల్యూఎస్ అని విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ నథింగ్ తరహాలోనే ట్రాన్స్ పరెంట్ కేస్ తో వస్తున్నాయి. ఇందులో ఛార్జింగ్ చూపించేందుకు డిజిటల్ డిస్ ప్లే ఉంది. దీని కేస్ కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. ఇందులో బెటర్ ఈఎన్ సీ టెక్నాలజీ ఉంది. మీ వాయిస్ ని గుర్తించి ఇతర శబ్ధాలను తగ్గిస్తుంది. మీ వాయిస్ అవతలి వారికి క్రిస్టల్ క్లియర్ గా వినిపిస్తుంది. ఇందులో 13 ఎంఎం హై ఫిడెలిటీ డ్రైవర్స్ ఉన్నాయి.
ఇందులో మీరు టచ్ కంట్రోల్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్, కాల్స్, గేమ్ మోడ్, వాల్యూమ్ కంట్రోల్ చేయచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు ప్లే టైమ్ లభిస్తుంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే100 నిమిషాల వరకు బ్యాకప్ లభిస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా లాంఛింగ్ ఆఫర్ కింద రూ.1,299కే అందిస్తున్నారు. ఈ వింగ్స్ ఫాంటమ్ 345 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉన్నాయి.
Related News
Infinix: స్మార్ట్ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ ధరలో రెండు ఫోన్లు లాంచ్..!
టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) తన బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ఫోన్ సిరీస్ 'Infinix Note 40 Pro 5G'ని విడుదల చేసింది.