Scientists Warn : కృత్రిమ మేధస్సు మానవ జాతిని అంతం చేస్తుందా..?శాస్త్రవేత్తలు ఎందుకు హెచ్చరిస్తున్నారు?
కృత్రిమ మేధస్సు మానవజాతిని అంతం చేసే అవకాశం ఉందని ఓ పరిశోధనా సంస్థ హెచ్చరించింది.
- By hashtagu Published Date - 05:54 PM, Sat - 17 September 22

కృత్రిమ మేధస్సు మానవజాతిని అంతం చేసే అవకాశం ఉందని ఓ పరిశోధనా సంస్థ హెచ్చరించింది. గూగుల్, ఆక్స్ ఫర్డ్ లోని శాస్త్రవేత్తలు AIభూమిపై ఉన్న వనరుల కోసం మానవులతో పోరాడుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మనుషులు, యంత్రాల మధ్య జరిగే యుద్ధాన్ని సినిమాల్లో చూశాం. కానీ ఇకమీదట AI,హ్యుమన్ మధ్య యుద్ధం చూసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, గూగుల్ కు చెందిన ఒక శాస్త్రవేత్త సమర్పించిన పరిశోధన పత్రంలో ఈ కృత్రిమ మేధస్సు మానవాళిని అంతరించేలా చేస్తుందని పేర్కొన్నారు. యంత్రాలు తప్పనిసరిగా మానవులతో వాటి శక్తి అవసరాల కోసం పనిచేస్తూ పోటీ పడతాయని వివరించారు.
AI మనుషులను చంపుతుందా?
AI మ్యాగజైన్ జర్నల్ లో గతనెలలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం AIద్వారా ముందస్తు ముప్పు ఇప్పుడు ఉన్నదానికంటే చాలా తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. AI డెవలప్ చెందితే..మొత్తం మానవ జాతిని అంతం చేస్తుందని వెల్లడించింది. ఈ పరిశోధనా బృందంలో ఒకరైన గూగుల్ డీప్ మైండ్ సీనియర్ శాస్త్రవేత్త మార్కస్ హట్టర్, ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు మైఖేల్ కోహెన్, మైఖేల్ ఓస్బోర్న్ భవిష్యత్తులో ఏఐ మానవులు సృష్టించిన నియమాలను ఉల్లంఘిస్తుందని ధృవీకరించారు. అయితే పరిశోధకులు ఏ నియమాల గురించి హెచ్చరిస్తున్నారో స్పష్టంగా తెలియనప్పటికీ రోబోట్ మానవునికి హాని కలిగించవచ్చని ఇస్తున్న ఆదేశాలు కావచ్చు అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే హెచ్చరించిన గూగుల్ ఇంజనీర్:
యంత్రాలు,AI డెవలప్ అయిన తర్వాత…అవి మానవులతో పోటీ పడతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాటి శక్తిని విచ్చిన్నం చేయడం, వాటిని సృష్టికర్తలతో కమ్యూనిటీలను తప్పనిసరి చేసే నియమాలను ఉల్లంఘించడం వంటివి కలిగి ఉంటుంది. గూగుల్ ఏఐ చాట్ బాట్ లలో ఒకటి సెన్సిటివ్ గా మారుతుందని హెచ్చరించిన ఓ ఉద్యోగిని గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే.
Related News

Google Birthday: గూగుల్‌కు 25 ఏళ్లు.. కంపెనీ గురించి ఈ విషయాలు తెలుసా..?
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google Birthday) టెక్నాలజీ ప్రపంచంలో ఎట్టకేలకు 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. గూగుల్ అధికారికంగా సెప్టెంబర్ 27, 1988న ప్రారంభించబడింది.