WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. వీడియో కాల్ ఇప్పుడు స్పష్టంగా చేసుకోవచ్చట!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
- By Anshu Published Date - 11:00 AM, Mon - 28 October 24

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ తప్పనిసరి గా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ వాట్సాప్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చిన్న చిన్న స్మార్ట్ ఫోన్ ల నుంచి పెద్దపెద్ద ఆండ్రాయిడ్ ఫోన్స్ వరకు ప్రతి ఒక్క ఫోన్ లో తప్పనిసరిగా వాట్సాప్ ఉండాల్సిందే. ఇలా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో అందుకు అనుగుణంగానే వాట్సప్ కూడా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది.. మరి ఆ వివరాల్లోకి వెళితే..
మనం ఇతరులకు వీడియో కాల్ చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు సరైన వెలుతురు లేదని ఫేస్ సరిగా కనిపించడం లేదని బ్రైట్ నెస్ ని పెంచుకుంటూ ఉంటాం. లేదంటే వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. కానీ ఇకమీదట ఆ అవసరం లేదు అంటుంది వాట్సప్ సంస్థ. వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాల నుండి వీడియో కాల్‌లు చేయడానికి వినియోగదారులకు సహాయపడే కొత్త సాంకేతికత పరిచయం చేసింది. లో లైట్ మోడ్ అనే కొత్త ఫీచర్ ఇప్పుడు మీకు వాట్సాప్ కాల్స్ చేయడంలో సహాయపడుతుంది. లో లైట్ మోడ్ అందుబాటులోకి రావడంతో బ్యాడ్ లైట్‌లో కూడా కాల్ లో ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా ఉంటుందని, కమ్యూనికేషన్ మరింత ప్రభావవంతంగా ఉంటుందని వాట్సాప్ అధికారులు చెబుతున్నారు.
వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఇంటర్‌ఫేస్ లో కుడివైపు ఎగువన ఉన్న బల్బ్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఉందట. యాప్ iOS, Android వెర్షన్‌లలో తక్కువ కాంతి మోడ్ అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. వీడియో కాల్ సమయంలోనే మెరుగైన అనుభవాన్ని అందించడానికి యాప్ ఇప్పటికే ఫీచర్లను ప్రవేశపెట్టింది. టచ్ అప్ ఫీచర్, ఫిల్టర్లను జోడించే ఆప్షన్, బ్యాక్‌గ్రౌండ్ ని మార్చుకునే ఫీచర్ తదితరాలు ఇంతకు ముందు వచ్చాయి. అలాగే వీడియో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ ని మార్చడంతో పాటు ఫిల్టర్ లను యాడ్ చేసుకునేందుకు ఈ కొత్త ఫీచర్ అవకాశం కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.