Caption Edit Feature : ఈ కొత్త ఫీచర్ మీ వాట్సాప్ లో వచ్చిందా ?
Caption Edit Feature : వాట్సాప్ ఇటీవల అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసింది..పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించే ఫీచర్ వాటిలో ఎంతో స్పెషల్..
- By Pasha Published Date - 11:08 AM, Mon - 21 August 23
Caption Edit Feature : వాట్సాప్ ఇటీవల అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసింది..
పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించే ఫీచర్ వాటిలో ఎంతో స్పెషల్..
ఇలాంటిదే ఇంకో ఫీచర్ ను తీసుకొచ్చేటందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది.
అదే.. “క్యాప్షన్ ఎడిటింగ్ ఫీచర్”.. !!
WhatsApp వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉన్న “మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్” ను అప్ గ్రేడ్ చేయడం ద్వారా మీడియా క్యాప్షన్‌లను కూడా ఇకపై ఎడిట్ చేసే అవకాశాన్ని కల్పించడం దీని ప్రత్యేకత.
Also read : Ginger Benefits: అల్లం టీ తో మలబద్దకం దూరం
ఇప్పటికే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం (iOS) 23.16.72 వర్షన్ లో కొంతమందికి ఈ ఫీచర్ ను టెస్ట్ ప్రాతిపదికన రిలీజ్ చేశారు. ఆండ్రాయిడ్ (Android) వర్షన్ స్మార్ట్ ఫోన్లు ఉన్నవాళ్లు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి తమ వాట్సాప్ ను అప్ డేట్ చేసుకుంటే “క్యాప్షన్ ఎడిటింగ్ ఫీచర్” అందుబాటులోకి వచ్చిందో రాలేదో తెలిసిపోతుంది. ప్రస్తుతానికి ఇది కొంతమందికే అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ కనిపించకుంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి. “క్యాప్షన్ ఎడిటింగ్ ఫీచర్” మీకు అందుబాటులోకి వచ్చిందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీడియా గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో లేదా వీడియో లేదా GIF లేదా డాక్యుమెంట్ ను వాట్సాప్ లో ఓపెన్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే “ఎడిట్” అనే ఆప్షన్ వస్తుంది. “ఎడిట్” ఆప్షన్ ద్వారా మీరు ఆ ఫోటో/వీడియో/GIF/ డాక్యుమెంట్ పై మీకు నచ్చిన క్యాప్షన్ (Caption Edit Feature) రాయొచ్చు. అప్పటికే రాసి ఉన్న క్యాప్షన్ ను ఈజీగా మార్చేయొచ్చు. మీరు క్యాప్షన్ ను మారిస్తే.. ఎవరికైతే అంతకుముందు దాన్ని పంపారో , వాళ్లకు చేరిన ఫోటో/వీడియో/GIF/ డాక్యుమెంట్ పై కూడా క్యాప్షన్ ఆటోమేటిక్ గా అప్ డేట్ అవుతుంది.
Also read : Aasara Pension Rs 3016 : ఆసరా పింఛను రూ.3,016కు పెంపు.. త్వరలో ఉత్తర్వులు ?