WhatsApp: వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకుంటున్న సరికొత్త ఫీచర్స్.. అవేంటంటే?
రోజు రోజుకీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
- By Nakshatra Published Date - 05:15 PM, Fri - 21 April 23
రోజు రోజుకీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరి ఇటీవల కాలంలో వాట్సాప్ సంస్థ ఫీచర్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా ఇటీవలే వాట్సాప్ స్టేటస్ విషయంలో ఒక అదిరిపోయే అప్డేట్ ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అదేమిటంటే వాట్సాప్ లో స్టేటస్ పెడితే ఆటోమేటిక్ గా ఫేస్ బుక్ లోకి వచ్చేలా సరికొత్త అప్డేట్ ని తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. అందుకు మీరు మీ ఫేస్ బుక్ ఖాతాని వాట్సాప్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా అంతకన్నా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తీసుకురానున్నట్లు Wabetainfo వెల్లడించింది. త్వరలోనే వాట్సాప్ లో యానిమేటెడ్ ఏమోజీలను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ గనుక వస్తే.. యూజర్లు సొంతంగా యానిమేటెడ్ ఏమోజీలను తయారు చేసుకోవచ్చు.
కాగా ఇటువంటి ఆప్షన్స్ థర్డ్ పార్టీ యాప్స్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ, వాట్సాప్ లో ఇలాంటి ఫీచర్ ని తీసుకురావడంపై యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యానిమేటెడ్ ఏమోజీల కోసం ఇంక వేరే యాప్స్ అవసరం లేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకా ఇది టెస్టుల దశలో ఉంది. అంతేకాకుండా దీనితో పాటుగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రీ డిజైన్డ్ కీ బోర్డుని కూడా తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కీబోర్డ్ స్థానంలో వాట్సాప్ సరికొత్త కీబోర్డుని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కేటగిరీస్ బార్ ని తొలగించి సెలక్షన్ బార్ ని బాటమ్ నుంటి టాప్ కి తీసుకురానున్నట్లు టాక్ నడుస్తోంది.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.