HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Whatsapp Business Rolling Out Ai Chatbot And Meta Verified Badge

WhatsApp Green Tick : వాట్సాప్ యూజర్లకూ గ్రీన్ టిక్.. ఎన్ని బెనిఫిట్సో​!

మీకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉందా ? ఒకవేళ  ఉంటే.. మీలాంటి వారి కోసం కొత్తకొత్త ఫీచర్లను వాట్సాప్ కంపెనీ రెడీ చేస్తోంది.

  • By Pasha Published Date - 05:45 PM, Sun - 9 June 24
  • daily-hunt
Whatsapp Green Tick
Whatsapp Green Tick

WhatsApp Green Tick : మీకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉందా ? ఒకవేళ  ఉంటే.. మీలాంటి వారి కోసం కొత్తకొత్త ఫీచర్లను వాట్సాప్ కంపెనీ రెడీ చేస్తోంది. వాట్సాప్ బిజినెస్ అకౌంటును వాడే వాళ్లకు ఇక గ్రీన్ టిక్‌ను కూడా కేటాయించనున్నారు. ఇందుకోసం యూజర్లు  మెటా వెరిఫికేషన్​కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అందిన తర్వాత మీ అకౌంటును కంపెనీ వేరిఫై చేసి, గ్రీన్ టిక్‌ను కేటాయిస్తుంది. గ్రీన్ టిక్‌ను వెరిఫికేషన్​ బ్యాడ్జ్​ అని పిలుస్తారు. ఇప్పటికైతే ఈ బ్యాడ్జీని ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేయడం లేదు. భవిష్యత్తులో ఇందుకోసం నామమాత్రంగా కొంత ఛార్జీని వసూలు చేసే అవకాశం  ఉందనని భావిస్తున్నారు. ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్, వాట్సాప్.. ఇవన్నీ మెటా కంపెనీ సోషల్ మీడియా వేదికలే. గ్రీన్ టిక్‌ను పొందే మెటా వేరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్  ఫీచర్‌ను ఇప్పటికే ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్ యూజర్లకు మెటా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దీన్ని వాట్సాప్ బిజినెస్ అకౌంటు యూజర్లు కూడా పొందనున్నారు.  వాస్తవానికి కొన్ని దేశాల్లో గతేడాది సెప్టెంబర్​లోనే మెటా వేరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను వాట్సాప్ బిజినెస్ యాప్​ వాడేవారి కోసం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఇప్పుడు ఇండియా,  బ్రెజిల్​, ఇండోనేషియా, కొలంబియా దేశాల్లో ఈ ఫీచర్‌ను(WhatsApp Green Tick) అందిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

లాభం ఏమిటి ?

  • మెటా వెరిఫైడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాట్సాప్ బిజినెస్ అకౌంటుకు  గ్రీన్ టిక్‌ను కేటాయిస్తారు.  దీనివల్ల అది  ఒరిజినల్ అకౌంటు అని నిర్దారణ అవుతుంది.
  • మీ బిజినెస్ నేమ్​తో మరొకరు నకిలీ ఖాతా తెరవకుండా అడ్డుకట్ట పడుతుంది.
  • మీ వాట్సాప్ బిజినెస్ అకౌంటుకు గ్రీన్ టిక్‌ను కేటాయించాక.. మీ మార్కెటింగ్ అవసరాల కోసం వాట్సాప్ ఛానల్​ను కూడా క్రియేట్ చేసి అందిస్తారు.
  • వాట్సాప్ బిజినెస్​ వెరిఫైడ్ ​ సబ్​స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లు ఒకటికి మించిన డిజిటల్  డివైజ్​ల నుంచి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

Also Read :Purandeshwari : పురందేశ్వ‌రికి లోక్‌సభ స్పీకర్ పదవి ?

  • మీ కస్టమర్లకు కనిపించేలా బిజినెస్ వివరాలతో కస్టమ్ వెబ్​పేజీని కూడా క్రియేట్ చేసుకునే ఛాన్స్ కల్పిస్తారు.
  • మీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్​కు గ్రీన్ టిక్ వచ్చాక.. మీ వ్యక్తిగత ఫోన్​ నంబర్​ ఇవ్వకుండానే కస్టమర్​ సపోర్ట్​కు నేరుగా కాల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇంకా​ టెస్టింగ్ దశలోనే ఉంది.
  •  వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ యూజర్లకు వచ్చే సందేహాలను ఆటోమేటిక్‌గా క్లియర్ చేసేందుకు నూతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్​ను కూడా మెటా కంపెనీ రెడీ చేసింది. దీన్ని కూడా  వాట్సాప్ బిజినెస్​ వెరిఫైడ్ ​ సబ్​స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లు వాడుకోవచ్చు.

Also Read :Ravneet Singh Bittu : మంత్రి పదవి ఆఫర్.. పరుగులు పెడుతూ పీఎంఓకు.. వీడియో వైరల్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI Chatbot
  • Meta Verified Badge
  • whatsapp
  • WhatsApp business
  • WhatsApp Green Tick

Related News

    Latest News

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd