Ravneet Singh Bittu : మంత్రి పదవి ఆఫర్.. పరుగులు పెడుతూ పీఎంఓకు.. వీడియో వైరల్
ఈసారి కేంద్రమంత్రి మండలిలో చాలామంది యువనేతలకు బీజేపీ అవకాశాన్ని కల్పించబోతోంది.
- By Pasha Published Date - 04:40 PM, Sun - 9 June 24

Ravneet Singh Bittu : ఈసారి కేంద్రమంత్రి మండలిలో చాలామంది యువనేతలకు బీజేపీ అవకాశాన్ని కల్పించబోతోంది. ఆ జాబితాలో రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా ఉన్నారు. ఈయన పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి ఫోన్ కాల్ వచ్చిన బీజేపీ నేతల జాబితాలో ఈయన పేరు కూడా ఉంది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి బయలుదేరారు. సరిగ్గా ఇదే సమయంలో సిటీలో ఒక్కసారిగా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆయన కారు ట్రాఫిక్ పద్మవ్యూహం నడుమ ఇరుక్కుపోయింది. ఇక చేసేదేం లేక బిట్టు కారును ట్రాఫిక్‌లోనే వదిలేసి.. పరుగెత్తుకుంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఆయన ఉరుకులు పరుగులతో.. ఆయాసపడుతూ ప్రధానమంత్రి కార్యాలయం వద్దకు చేరకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గులాబీ రంగు తలపాగా, ఫార్మల్ వైట్ దుస్తులలో బిట్టును పరుగుత్తెతూ మనం చూడొచ్చు. ఇవాళ రాత్రి 7.15 నిమిషాలకు ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ లిస్టులో దాదాపు 50 మంది నేతలు ఉన్నారని తెలుస్తోంది. వీరితో పాటు పంజాబ్ బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రవ్‌నీత్ సింగ్ బిట్టు ఎవరు?
రవ్‌నీత్ సింగ్ బిట్టు(Ravneet Singh Bittu).. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఈ ఏడాది ప్రారంభంలోనే బిట్టు కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేారారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో లూథియానా స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజా వారింగ్ గెలిచారు. కాగా, గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ట్రాక్ రికార్డు రవ్‌నీత్ సింగ్ బిట్టుకు ఉంది.ఇక తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేత అన్నామలైకు కూడా కేంద్రమంత్రి పదవిని ప్రధాని మోడీ కట్టబెట్టబోతున్నారు.
Also Read :Mahesh Babu : మహేష్ బాబు ఇంతలా డైట్ ఫాలో అవుతారా..? ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా..
Delhi: BJP leader Ravneet Singh Bittu walks to the PM’s residence after his car got stranded in traffic pic.twitter.com/a3KZfdFprL
— IANS (@ians_india) June 9, 2024