అదిరిపోయే లుక్కు తో వివో వై 16..ఫీచర్లు,ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ వివో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో రకాల మొబైల్ లను మార్కెట్లోకి విడుదల
- By Nakshatra Published Date - 05:36 PM, Tue - 27 September 22

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ వివో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో రకాల మొబైల్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచిలను దృష్టిలో ఉంచుకున్న వివో సంస్థ అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో మొబైల్ లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వివో తన వై-సిరీస్ నుంచి వై 16 ఫోన్ ను ప్రవేశపెట్టింది. కాగా ఈ ఫోన్ ఇతర విషయానికి వస్తే..
రూ.9,999 (3జీబీ +32జీబీ) అలాగే రూ.12,499 (4జీబీ+64 జీబీ) గా వుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ కలర్ ల విషయానికి వస్తే.. స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ రంగుల్లో లభించనుంది. అదేవిధంగా కోటక్, ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్, బీవోబీ, ఫెడరల్, ఏయూ బ్యాంక్ లకు సంబంధించిన కార్డులతో రూ. 1,000 వరకు పొందవచ్చు. అలాగే ఆన్‌లైన్ కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్,క్రెడిట్ కార్డులపై రూ. 750 మేర క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.
ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే ,6.51 అంగుళాల స్క్రీన్, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ వేక్ ఫీచర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కార్డ్ స్లాట్, 13 ఎంపీ మెయిన్ 2 ఎంపీ మాక్రో కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా,తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివో సంస్థ వెల్లడించింది.
Related News

Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.