Vivo V40: 3డీ కర్డ్వ్ డిస్ ప్లేతో ఆకట్టుకుంటున్న వివో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లతో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా
- By Anshu Published Date - 10:30 AM, Wed - 24 July 24

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లతో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన వివో సంస్థ ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
వివో వి40 సిరీస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా వివో 40, వివో ప్రో పేరుతో ఈ ఫోన్ లను తీసుకొస్తున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి అన్న విషయానికొస్తే.. వివో వి40 స్మార్ట్ ఫోన్‌లో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను ప్రత్యేకంగా అందించారు. ఇక ఈ రెండు ఫోన్ లు లోనూ 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి. ఇందులో ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూల్ సెటప్ తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెల అనగా ఆగస్ట్ లో భారత్ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఫోన్స్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించానున్నారు.
2800×1260 పిక్సెల్ రిజల్యూషన్, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్ట్ తో ఈ స్క్రీన్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్ ను వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ తో తీసుకొచ్చారు. వివో వి40 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 2 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ ఫోన్ సొంతం అని చెప్పాలి. ఇకపోతే ఈ ఫోన్ కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో 5జీ, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను సైతం అందించారు.
అలాగే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన మెయిన్ కెమెరా తో పాటుగా 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను సైతం ఇచ్చారు. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.