vivo Y36i: రూ. 14 వేలకే వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిం
- By Nakshatra Published Date - 10:34 PM, Mon - 1 April 24
![vivo Y36i: రూ. 14 వేలకే వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/vivo-Y36i.jpeg)
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే మంచి మంచి ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది వివో సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే..
వివో వై36ఐ పేరుతో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనా మార్కెట్ లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివో వై36ఐ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్డీ+ డిస్ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
ఇకపోతే.. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 13 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. వివో వై36ఐ ఫోన్లో 15 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ బేస్ వేరియంట్ ఇండియన్ కరెన్సీలో రూ. 14,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Oppo K12x 5G: మార్కెట్లోకి రాబోతున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/MixCollage-24-Jul-2024-10-21-AM-2247.jpg)
Oppo K12x 5G: మార్కెట్లోకి రాబోతున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే అనేక రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త