Vivo G2: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వివో సరికొత్త స్మార్ట్ ఫోన్?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. విని
- By Nakshatra Published Date - 03:00 PM, Mon - 22 January 24
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది వివో సంస్థ. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఆ స్మార్ట్ ఫోన్ ధర,ఫీచర్ల విషయానికొస్తే.. కాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో జీ2 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.
ప్రస్తుతం చైనా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోకి లాంచ్ చేయనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. భారత కరెన్సీలో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,000 కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,500, ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,700గా ఉండనుంది. ఇక వివో జీ2 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. 720×1,612 పిక్సెల్ ఈ స్క్రీన్ సొంతం. రిఫ్రెష్ రేట్ 90Hz, 89.67 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందించారు.
వివో జీ2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆరిజిన్ ఓఎస్ 3పై పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్లో మీడియాటెక్ 7ఎన్ఎమ్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను సైడ్‌కు అమర్చారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. వివో జీ2 స్మార్ట్ ఫోన్లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.