Twitter New Logo : ట్విట్టర్ కు కొత్త లోగో.. ఫస్ట్ లుక్ చూడండి
Twitter New Logo : ట్విట్టర్ కంపెనీ లోగో మారిపోనుంది. ఐకానిక్ బర్డ్ లోగో ప్లేస్ లో మరో సరికొత్త లోగోను తీసుకురానున్నారు.
- Author : Pasha
Date : 23-07-2023 - 1:21 IST
Published By : Hashtagu Telugu Desk
Twitter New Logo : ట్విట్టర్ కంపెనీ లోగో మారిపోనుంది. ఐకానిక్ “బర్డ్” లోగో ప్లేస్ లో మరో సరికొత్త లోగోను తీసుకురానున్నారు. కొత్త లోగో డిజైన్ వీడియోను ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “త్వరలో మేము ట్విట్టర్ బ్రాండ్ లోగోలో ఉన్న అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతాం. ది బెస్ట్ “X లోగో”ను ఈరోజు రాత్రికల్లా పోస్ట్ చేస్తాం.. వీలైతే మా కొత్త బ్రాండ్ లోగో (Twitter New Logo) రేపటికల్లా ప్రపంచవ్యాప్తంగా లైవ్ లోకి వస్తుంది” అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. గత సంవత్సరమే ట్విట్టర్ ను కొన్న ఎలాన్ మస్క్ ఆ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎన్నో మార్పులు చేశారు. అయితే ఏకంగా లోగోనే మార్చేయడం అనేది అతిపెద్ద అనూహ్య మార్పు అని పరిశీలకులు అంటున్నారు.
— Elon Musk (@elonmusk) July 23, 2023
Also read : Triumph Speed 400: మార్కెట్‌లో దూసుకుపోతున్న ట్రయంఫ్ బైక్.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా..?
వాస్తవానికి Twitter ఇప్పుడు స్వతంత్ర సంస్థ కాదు. “X Corp” పేరుతో కొత్తగా ఏర్పడిన సంస్థలో ట్విట్టర్ ను విలీనం చేశారు. ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో ‘X’ లోగో డిజైన్ ను పోస్ట్ చేసిన తర్వాత ఈవిషయం వెలుగులోకి వచ్చింది.’X’ అక్షరంపై ఎలాన్ మస్క్ కు మొదటి నుంచీ ఎంతో మక్కువ. ట్విట్టర్ కు “X” అని పేరు మార్చాలనే ఇంట్రెస్ట్ ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎలాన్ మస్క్ చెప్పాడు.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023
Also read : Daksha nagarkar : బిగుతైన అందాలతో దక్ష నాగార్కర్ హాట్ స్టిల్స్