Threads – Hashtags : ఇక ‘థ్రెడ్స్’లోనూ ‘హ్యాష్‌ట్యాగ్స్’.. అయితే ఒక ట్విస్ట్
Threads - Hashtags : ‘థ్రెడ్స్’ యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పటివరకు ఆ యాప్‌లో హ్యాష్‌ట్యాగ్స్‌కు సపోర్ట్ ఉండేది కాదు.
- By Pasha Published Date - 12:49 PM, Fri - 8 December 23

Threads – Hashtags : ‘థ్రెడ్స్’ యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పటివరకు ఆ యాప్‌లో హ్యాష్‌ట్యాగ్స్‌కు సపోర్ట్ ఉండేది కాదు. అది గతం.. ఇకపై ‘థ్రెడ్స్’ యాప్ లోనూ హ్యాష్ ట్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. అయితే అవి Instagram, ట్విట్టర్ (X)లో వాడే హ్యాష్‌ట్యాగ్స్ కంటే డిఫరెంట్‌గా ఉంటాయి. థ్రెడ్స్ యాప్‌లో హ్యాష్ ట్యాగ్స్ పూర్తి విభిన్నంగా పనిచేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
సాధారణంగా మనకు హ్యాష్‌ట్యాగ్ కావాలంటే # గుర్తును నొక్కి.. దాని పక్కనే మనకు నచ్చిన టాపిక్‌ను జోడిస్తాం. థ్రెడ్స్ యాప్‌లో వాడబోయే హ్యాష్ ట్యాగ్స్ ఇందుకు పూర్తి భిన్నమైనవి. ఎంతో సౌకర్యవంతమైనవి. ఇందులోనూ మనం # గుర్తును నొక్కి.. దాని పక్కన వరుస పెట్టి ఒకటికి మించి పదాలను టైప్ చేయొచ్చు. ఆ పదాల మధ్య గ్యాప్ ఉన్నా.. లేకున్నా.. ఇబ్బందేం ఉండదు. # పక్కన వాడే పదాలలో స్పెషల్ క్యారెక్టర్లను సైతం వాడే వెసులుబాటు ఉంది. థ్రెడ్స్‌లోని హ్యాష్ ట్యాగ్ వాటన్నింటిని ఈజీగా గుర్తిస్తుంది. యూజర్లు ఈజీగా యాప్‌ను వాడగలిగేలా చేయడానికే ఈ ఏర్పాట్లు చేశామని థ్రెడ్స్ యాప్ నిర్వాహకులు వెల్లడించారు.
Also Read: PM Modi: కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్
థ్రెడ్స్ యాప్ అనేది ఫేస్ బుక్(మెటా)కు చెందినదే. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ గత నెలలోనే ఈ ఫీచర్‌ను మొదటిసారిగా ప్రకటించారు. అప్పట్లో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ఆస్ట్రేలియాలో విడుదల చేశారు. ఇప్పుడది యావత్ ప్రపంచంలో(Threads – Hashtags) అందుబాటులోకి వచ్చేసింది.