PM Modi: కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్
"తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను
- Author : Balu J
Date : 08-12-2023 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అర్ధరాత్రి జారపడి గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం త్వరగా కోలుకోవాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఆయన ఎక్స్‌లో మాట్లాడుతూ “తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. గురువారం రాత్రి పడిపోవడంతో రావు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఫ్రాక్చర్ అయినట్లు అనుమానిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 69 ఏళ్ల BRS ప్రెసిడెంట్ పరిస్థితిని వైద్యులు అంచనా వేస్తున్నారు. శస్త్రచికిత్స అవసమని డాక్టర్లు చెప్పారు.
Also Read: PM Modi: కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్