WhatsApp Update: ఇకపై వాట్సాప్ కాల్ చెయ్యాలన్న బిల్ పే చెయ్యాల్సిందే.. సరికొత్త రూల్స్?
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిత్యం కోట్లాదిమంది
- By Nakshatra Published Date - 03:50 PM, Wed - 26 October 22
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిత్యం కోట్లాదిమంది ఈ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను చాటింగ్ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో వాట్సాప్ సంస్థ వారు వినియోగదారుల కోసం సరికొత్త ఫ్యూచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికీ కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. కదా ఇప్పటికే ప్రైవసీ, సెక్యూరిటీ, స్టేటస్ ప్రైవసీ,సెట్టింగ్స్ ఇలా అనేక విషయాలలో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ వినియోగదారులకు ఒక బిగ్ షాక్ ఇచ్చింది. అదేమిటంటే.. వాట్సాప్,సిగ్నల్, టెలిగ్రామ్ ఇలాంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్ లకు టెలికాం రూల్స్ ఉండాలి అని COAI ను కోరింది. టెలికాం సంస్థలు టవర్లు, నెట్వర్క్ కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు అనేక రకాల నిబంధనలకు కూడా లోబడి పని చేస్తాము అని తెలిపాయి.
అయితే ఆరోగ్యకర పోటీ కోసం ఓటీటీ కమ్యూనికేషన్ యాపులకు వీటిని వర్తింపజేయాలని లేదంటే తమ లైసెన్స్ తెలుగు నియంత్రణలను తరలించాలి అని తెలిపింది వాట్సాప్ సంస్థ. ఒకవేళ ఈ రూల్స్ పెడితే ఖచ్చితంగా వాట్సాప్ లో కాల్స్ ఉచితంగా ఉండవు. వాట్సాప్ లో కాల్స్ చేసుకోవాలి అంతే కచ్చితంగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి ఈ విషయంపై వాట్సాప్ సంస్థ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి మరి.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.