Tecno Spark 20 Pro: లాంచింగ్ కి సిద్ధమైన టెక్నో ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రస్తుతం మార్కెట్లో 5 జీ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే నెమ్మదిగా 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో మొబైల్ తయారీ సంస్థలు 5జీ నె
- By Anshu Published Date - 06:11 PM, Sat - 6 July 24

ప్రస్తుతం మార్కెట్లో 5 జీ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే నెమ్మదిగా 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో మొబైల్ తయారీ సంస్థలు 5జీ నెట్వర్క్ కి సపోర్ట్ చేసే 5 స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే మొదట్లో 5g స్మార్ట్ ఫోన్లు ధరలు భారీగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్లోకి 5జి ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా టెక్నో సంస్థ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మరి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. టెక్నో స్పార్క్ 20 ప్రో పేరుతో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారు. జుల్ 9వ తేదీన ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ను అందించనున్నారు. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకురానున్నారు. కాగా ఈ ఫోన్ పోన్ లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో పంచ్ హోల్ తో కూడిన 8 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ను ఇవ్వనున్నారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే..
108 మెగా పిక్సెల్స్ తో కూడిన కెమెరాను ఇవ్వనున్నారు. ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ రానుంది. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 33 వాట్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనుంది. ఐపీ53 రేటింగ్ తో కూడిన వాటర్ రెసిస్టెంట్ ను ఇవ్వనున్నారు. స్టీరియో స్పీకర్స్, సౌండ్ మౌంటెడ్ ఫింగర్ ప్రిట్ స్కానర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్ కు కుడి వైపున పవర్ బటన్ తో పాటు వాల్యూమ్ రాకర్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఫోన్ రూ. 20 వేలలోపు ఉండవచ్చని అంచనా.