HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Sleep Vs Shutdown Vs Hibernate Which Of These Computer Power Options Is The Best

Computer Power Options : కంప్యూటరులో హైబర్నేట్ మోడ్, స్లీప్ మోడ్ మధ్య తేడా తెలుసా ?

Computer Power Options : విండోస్ కంప్యూటర్లలోని పవర్ ఆప్షన్లలో స్లీప్ మోడ్ మంచిదా ?  షట్​ డౌన్ మోడ్ మంచిదా ?

  • By Pasha Published Date - 11:31 AM, Wed - 27 December 23
  • daily-hunt
Computer Power Options
Computer Power Options

Computer Power Options : విండోస్ కంప్యూటర్లలోని పవర్ ఆప్షన్లలో స్లీప్ మోడ్ మంచిదా ?  షట్​ డౌన్ మోడ్ మంచిదా ? హైబర్నేట్ మోడ్ మంచిదా ? వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏది అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. వాస్తవానికి ఈ మూడు ఆప్షన్లకు తోడుగా ఫాస్ట్ స్టార్టప్ అనే మరో ఆప్షన్​ను కూడా మైక్రోసాఫ్ట్ జోడించింది.

We’re now on WhatsApp. Click to Join.

  • మనం ‘హైబర్నేట్ మోడ్‌’ను వాడితే.. కంప్యూటర్ ర్యామ్​లోని కంటెంట్​ను హార్డ్​ డిస్క్​ లేదా ఎస్​ఎస్​డీలో సేవ్​ చేస్తుంది. ఆ తర్వాతే కంప్యూటర్​​​ పవర్ ​ఆఫ్ అవుతుంది. మనం ఎక్కువ అప్లికేషన్లు ఓపెన్​ చేసినప్పుడు, కంప్యూటర్​ హైబర్నేట్ కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మనం మళ్లీ కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు.. అంతకుముందు ఉపయోగించిన అప్లికేషన్లు అన్నీ బ్యాకప్ అవుతాయి. ప్రొఫెషనల్స్​కు, చాలా అప్లికేషన్లు వాడేవారికి హైబర్నేట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
  • కంప్యూటర్‌ను లోపవర్ మోడ్​లో ఉంచే ఆప్షన్ పేరే ‘స్లీప్ మోడ్’. ఈ మోడ్​లో ఉన్నప్పుడు కంప్యూటర్‌లోని ర్యామ్​కు పవర్ సప్లై అవుతుంది. ఫలితంగా మీరు పీసీలో ఉపయోగించిన అన్ని యాప్​లు, డేటా ప్రాసెస్​లోనే ఉంటాయి. ఈ దశలో కంప్యూటర్ పవర్ ఆఫ్ చేసినా, ఎటువంటి డేటాను కోల్పోయే ఛాన్స్ ఉండదు.
  • ‘స్లీప్ మోడ్’​‌లో ఉన్నప్పుడు.. ఫుల్ షట్​డౌన్​ కంటే త్వరగా యాప్‌లు రీలోడ్ అవుతాయి. ఇలాంటి దశలో పీసీ లేదా ల్యాప్​టాప్​లో బ్యాటరీ ఛార్జ్ అయిపోయినప్పుడు ర్యామ్​లో ఉన్న సమాచారం అంతా పోతుంది. అందుకే ఈ మోడ్​లో ఉంచేటప్పుడు పవర్​ సప్లై జరిగేలా చూసుకోవడం అవసరం.
  • కంప్యూటరులో ‘షట్ డౌన్’ ఆప్షన్​ వాడితే.. అప్పటి వరకు ఓపెన్​ చేసి ఉన్న యాప్​లన్నీ క్లోజ్ అవుతాయి. ఏ అప్లికేషన్​, డేటా కూడా ప్రిజర్వ్​ కాదు. మళ్లీ మీరు పీసీ ఓపెన్​ చేయాలనుకుంటే.. మొత్తం రీబూట్ అవుతుంది. షట్​డౌన్​ ఆప్షన్ అనేదది కంప్యూటర్​కు పవర్​కట్ చేస్తుంది. స్లీప్, హైబర్నేట్​లతో పోలిస్తే కంప్యూటర్​ షట్​డౌన్ కావడానికి ఎక్కువ టైమే పడుతుంది.

Also Read: Rajya Sabha 2024 : 2024లో ‘పెద్దల సభ’లో పెద్ద మార్పులివీ.. !

  • కొద్దిసేపు కంప్యూటర్​ను ఉపయోగించము అనుకున్న టైంలో కంప్యూటరును స్లీప్ మోడ్​లో ఉంచొచ్చు.  కంప్యూటరు బ్యాటరీలో తగినంత ఛార్జింగ్ ఉన్నప్పుడే ఈ ఆప్షన్​ను ఉపయోగించుకుంటే బెస్ట్.
  • కంప్యూటరు బ్యాటరీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు సిస్టమ్​ను ఎక్కువ టైం ఉపయోగించాలనుకుంటే హైబర్​నెట్ ఆప్షన్ బెస్ట్.
  • కంప్యూటరులో వర్క్ అంతా పూర్తయ్యాక షట్​డౌన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • కంప్యూటరు ప్రతిసారీ కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్లు అందించిన ఫాస్ట్ స్టార్టప్ ఆప్షన్​ను(Computer Power Options) వాడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Computer Power Options
  • Hibernate Mode
  • Shutdown Mode
  • Sleep Mode

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd