Samsung Galaxy f54 5g: మార్కెట్లోకి శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్ లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మా
- By Nakshatra Published Date - 06:00 PM, Fri - 19 May 23
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్ లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడంతో పాటు, ఆల్రెడీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ఆఫర్లను ప్రకటిస్తోంది. వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే శాంసంగ్ సంస్థ తాజాగా మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ ని కూడా విడుదల చేయబోతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్54 5జీ పేరుతో లాంచ్ చేయనుంది. మరి ఆ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999గా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇకపోతే ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో Exynos 1380 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే 25 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు విడుదల కావున ఉంది ఏంటి అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వినియోగదారులు ఎక్కువ శాతం శాంసంగ్ ఫోన్లను విక్రయిస్తుండడంతో శాంసంగ్ సంస్థ తన మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Related News
Smart phone : స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
Indian Computer: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకోవచ్చని, ఫోన్ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని �