Samsung: మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్?
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ల పైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. దాంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం మొబైల్ తయారీ సంస్థలు కూడా అందుకు
- By Anshu Published Date - 11:00 AM, Fri - 19 July 24

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ల పైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. దాంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం మొబైల్ తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ ఎమ్35 ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ బడ్జెట్ ను టార్గెట్ తో తీసుకొచ్చారు. మరి ఈ ఫోన్లో ఫీచర్ల విషయానికొస్తే.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్35 5జీ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్ లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ 100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం అని చెప్పవచ్చు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో ఆక్టాకోర్ ఎగ్జినోస్ 130 ప్రాసెసర్ ను కూడా ఇచ్చారు. ఈ స్క్రీన్ కు కార్నింగ్ గొరిల్లా విక్టస్+ ప్రొటెక్షన్ ను అందించారు.
ఇకపోతే కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో వైఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్ లను సైతం అందించారు. కాగా ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్,8 మెగా పిక్సెల్స్ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్లలో లభించునుంది. అందులో 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా,8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.21,499 గా ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమ్మకాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా అన్ని ఆఫర్స్ కలుపుకొని రూ. 3 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.