Samsung Galaxy A06: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న శాంసంగ్ స్మార్ట్ ఫోన్!
శాంసంగ్ సంస్థ మార్కెట్లకు ఈ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది..
- By Nakshatra Published Date - 11:34 AM, Fri - 6 September 24
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. అలాగే ఇప్పటికీ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ను కూడా ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్లో శాంసంగ్ ఫోన్ ఒకటి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకొచ్చారు. గ్యాలక్సీ ఏ06 పేరుతో తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే 2 ఎంపీతో కూడిన సెకండరీ కెమెరాను కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్స్ తో ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఇక ఈ ఫోన్ లో 6.7 ఇంచెస్ తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీ+ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం అని చెప్పవచ్చు.
ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇకపోతే ధర విసయానికొస్తే.. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ. 9,999 గా నిర్ణయించారు. అయితే 128 జీబీ వేరియంట్ ధర రూ. 11,499గా నిర్ణయించారు. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో బ్లూటూత్ v5.3 జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. సెక్యూరిటీ విషయానికొస్తే ఇందులో.. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ ను అందించారు.
Related News
Vivo T3 Ultra Launch: త్వరలోనే మార్కెట్ లోకి వివో టీ3 అల్ట్రా.. లాంచ్ అయ్యేది అప్పుడే!
వివో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమయింది.